స్వంత ఇంటి నిర్మాణానికి సీఎం చంద్రబాబు భూమి పూజ

- April 09, 2025 , by Maagulf
స్వంత ఇంటి నిర్మాణానికి సీఎం చంద్రబాబు భూమి పూజ

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని అమరావతిలో కట్టుకుంటున్న సొంత ఇంటి నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ ఉదయం 8.51 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య భూమి పూజ జరిగింది.ఈ కార్యక్రమానికి నారా, నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కాగా, సచివాలయం వెనుక E9 రహదారి పక్కన వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల భూమిలో ఇంటి నిర్మాణం చేయనున్నారు. రాజధాని కోర్ ఏరియాలో చంద్రబాబు ఇంటిని కట్టుకుంటున్నారు. 5 ఎకరాల స్థలంలో చంద్రబాబు నివాసంతో పాటు, పక్కనే కాన్ఫరెన్స్ హాల్, పార్కింగ్ ఏరియా ఉంటాయి. ఇంటిని 1,455 చదరపు గజాల విస్తీర్ణంలో జీ ప్లస్ వన్ మోడల్ లో నిర్మించనున్నారు. ఏడాదిన్నర సమయంలో ఇంటి నిర్మాణం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com