'డోరా' హాస్యం, థ్రిల్లర్‌ చిత్రం

- July 07, 2016 , by Maagulf
'డోరా'  హాస్యం, థ్రిల్లర్‌ చిత్రం

మాయ'లో తన నటనతో నయనతార అందర్నీ భయపెట్టింది. ప్రస్తుతం తెలుగులో 'బాబు బంగారం', తమిళంలో 'తిరునాల్‌', 'కాష్మోరా', 'ఇరుముగన్‌'తోపాటు మొత్తం అయిదు సినిమాల్లో నటిస్తోంది. 'కళవాని', 'వాగైసూడవా'లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సర్గుణం ఇప్పుడు నిర్మాతగా ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఇందులో నయనతార ప్రధాన పాత్ర పోషిస్తారని గతంలోనే ప్రకటించారు. ఈ సినిమాకు 'డోరా' అని తాజాగా పేరు పెట్టారు. దాస్‌ రామస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. 'మాయ' మాదిరిగానే హర్రర్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో హాస్యం, థ్రిల్లర్‌ కూడా ఉంటాయని సమాచారం. దినేష్‌ కృష్ణన్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. వివేక్‌శివ, మెర్విన్‌ సాలమన్‌ సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. బుల్లితెరపై 'డోరా' కార్యక్రమం చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అదే తరహాలో వారినీ ఆకర్షించేలా నయనతార పాత్ర ఉంటుందని సమాచారం

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com