చంద్రబాబు నాయుడు బృందం రష్యా పర్యటన..

- July 07, 2016 , by Maagulf
చంద్రబాబు నాయుడు బృందం రష్యా పర్యటన..

ఈనెల 10 నుంచి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం రష్యాలో పర్యటిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ తెలిపారు. రష్యాలో అంతర్జాతీయ పారిశ్రామిక ప్రదర్శన ఇన్నోప్రోమ్‌లో సీఎం పాల్గొంటారని తెలిపారు. పారిశ్రామిక ప్రదర్శనకు భారత్‌ నుంచి ముగ్గురు సీఎంలు హాజరవుతారని వివరించారు. రష్యా పర్యటనకు ఒక్కరోజు ముందు కొత్తగా నిర్మించిన కజకిస్థాన్‌ రాజధాని అస్తానాను సీఎం సందర్శిస్తారని వెల్లడించారు. రష్యాలో ముఖ్యనేతలు, పారిశ్రామికవేత్తలతోనూ సీఎం భేటీ అవుతారని పేర్కొన్నారు. పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా చంద్రబాబు రష్యా పర్యటన సాగుతుందని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com