'డోరా' హాస్యం, థ్రిల్లర్ చిత్రం
- July 07, 2016
మాయ'లో తన నటనతో నయనతార అందర్నీ భయపెట్టింది. ప్రస్తుతం తెలుగులో 'బాబు బంగారం', తమిళంలో 'తిరునాల్', 'కాష్మోరా', 'ఇరుముగన్'తోపాటు మొత్తం అయిదు సినిమాల్లో నటిస్తోంది. 'కళవాని', 'వాగైసూడవా'లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సర్గుణం ఇప్పుడు నిర్మాతగా ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఇందులో నయనతార ప్రధాన పాత్ర పోషిస్తారని గతంలోనే ప్రకటించారు. ఈ సినిమాకు 'డోరా' అని తాజాగా పేరు పెట్టారు. దాస్ రామస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. 'మాయ' మాదిరిగానే హర్రర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో హాస్యం, థ్రిల్లర్ కూడా ఉంటాయని సమాచారం. దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. వివేక్శివ, మెర్విన్ సాలమన్ సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. బుల్లితెరపై 'డోరా' కార్యక్రమం చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అదే తరహాలో వారినీ ఆకర్షించేలా నయనతార పాత్ర ఉంటుందని సమాచారం
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







