ఇ.ఎస్.ఐ సేవలను మరింత మెరుగుపరిచే దిశగా చర్యలు
- April 11, 2025
విజయవాడ: ఇ.ఎస్.ఐ హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవలను మరింత మెరుగుపర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కార్మిక శాఖ అదనపు అదనపు కార్యదర్శి గంధం చంద్రుడు స్పష్టం చేసారు.శుక్రవారం ఉదయం విజయవాడ ఇ.ఎస్.ఐ హాస్పిటల్‌ను సందర్శించిన చంద్రుడు, ఓపీ రిజిస్ట్రేషన్, లాబరేటరీ, ఇన్‌పేషెంట్, అవుట్‌పేషెంట్ విభాగాలను పరిశీలించారు. రోగుల నుంచి నేరుగా ఫీడ్‌బ్యాక్ తీసుకుని, వైద్య సేవలు మరింత ప్రభావవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ధన్వంతరి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఆధార్ అనుసంధానం వంటి అంశాలను సమీక్షించిన చంద్రుడు, రిజిస్ట్రేషన్ వ్యవస్థను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. చందాదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు. హాస్పిటల్ అభివృద్ధికి అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేసిన చంద్రుడు, ఇ.ఎస్.ఐ డైరెక్టర్ వి. ఆంజనేయులకు తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. వి. జ్యోతి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







