చికెన్ షిప్మెంట్లో 46.8 కిలోల కొకైన్..అడ్డుకున్న కస్టమ్స్..!!
- April 12, 2025
జెడ్డా: జెడ్డా ఇస్లామిక్ పోర్ట్ ద్వారా రాజ్యంలోకి 46.8 కిలోగ్రాముల కొకైన్ను అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాన్ని జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ (ZATCA) అడ్డుకుంది. చికెన్ షిప్మెంట్ కూలింగ్ యూనిట్లో కొకైన్ ను దాచారని అధికారులు తెలిపారు. అధునాతన భద్రతా స్క్రీనింగ్, ప్రత్యక్ష తనిఖీలను ఉపయోగించి కస్టమ్స్ విధానాల సమయంలో కొకైన్ ను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఏదైనా అనుమానిత స్మగ్లింగ్ కార్యకలాపాలను 1910 వద్ద ఉన్న రహస్య హాట్లైన్, [email protected] వద్ద ఇమెయిల్ లేదా 009661910 అంతర్జాతీయ నంబర్ ద్వారా నివేదించాలని కూడా అథారిటీ ప్రజలను కోరింది. సరైన సమాచారం అందించిన వారికి ఆర్థిక బహుమతులను అందిస్తామని వెల్లడించారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







