కీలక మ్యాచ్‌లో విండీస్‌పై భారత్ ఘన విజయం..
- March 01, 2026
సెమీస్ లోకి వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది.విండీస్ పై ఘనవిజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో విండీస్ ను చిత్తు చేసింది.ఈ గెలుపుతో సెమీ ఫైనల్ లోకి దూసుకెళ్లింది భారత్. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.196 పరుగుల టార్గెట్ ను భారత్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేదించింది. ఓపెనర్ సంజూ శాంసన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.చివరి వరకు క్రీజులో ఉండి భారత్ ను గెలిపించాడు. సంజూ 50 బంతుల్లో 97 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
డూ ఆర్ డై మ్యాచ్ లో సంజూ శాంసన్ అద్భుతంగా ఆడాడు. ఓ ఎండ్ లో వికెట్లు పడ్డా.. మరో ఎండ్ లో ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అభిషేక్ శర్మ(10), ఇషాన్ కిషన్ (10) లు తక్కువ పరుగులకే ఔట్ అయినా.. సంజా మాత్రం దూకుడు ప్రదర్శించాడు. వరుసగా బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత చివరి వరకు క్రీజులో ఉండి భారత్ కు ఘన విజయాన్ని అందించాడు.
ఈ నెల 5న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే సెమీఫైనల్-2 లో ఇంగ్లండ్, భారత్ తలపడనున్నాయి. ఈ నెల 8న ఫైనల్ జరగనుంది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







