తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ప్రయాణం ప్రారంభించిన స్పోర్ట్స్ హ్యాకథాన్ టార్చ్
- March 02, 2026
టీ-వర్క్స్ నుంచి ప్రారంభమైన టార్చ్ మార్చి 28న గచ్చిబౌలి స్టేడియంలో ముగింపు
హైదరాబాద్: స్పోర్ట్స్ మరియు ఇన్నోవేషన్ సమన్వయానికి ప్రతీకగా నిర్వహించిన స్పోర్ట్స్ హ్యాకథాన్ టార్చ్ ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లోని టీ-వర్క్స్ లో ఘనంగా నిర్వహించబడింది. స్పోర్ట్స్ హ్యాకథాన్‌కు తొలి అధికారిక కార్యక్రమంగా నిర్వహించిన ఈ వేడుక ద్వారా రాష్ట్రవ్యాప్తంగా యువత, క్రీడాకారులు మరియు ఇన్నోవేటర్లను ఒకే వేదికపైకి తీసుకురావడం లక్ష్యంగా టార్చ్ ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రపంచ స్థాయి ఇన్నోవేషన్ కేంద్రాలైన టీ-వర్క్స్ మరియు టీ-హబ్ నుండి ప్రారంభమైన ఈ టార్చ్, ఆవిష్కరణల నుంచి క్రీడా రంగానికి సాగుతున్న ప్రయాణానికి ప్రతీకగా నిలిచింది. కార్యక్రమంలో భాగంగా దక్షిణ కొరియా నుండి వచ్చిన 33 మంది సంగీత కళాకారులు ప్రత్యేక సాంస్కృతిక సంగీత కార్యక్రమం నిర్వహించి అంతర్జాతీయ స్నేహభావాన్ని ప్రతిబింబించారు. అలాగే రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు టార్చ్‌తో కలిసి నిర్వహించిన మార్చ్‌పాస్ట్ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా హ్యాకథాన్ బ్రాండ్ ఓనర్ సందీప్ కుమార్ మక్తాల స్పోర్ట్స్ హ్యాకథాన్ టార్చ్‌ను తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ లైసెన్సీ హరిసాయి రేపర్తికు అధికారికంగా అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా టార్చ్ రిలే కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న హరిసాయి రేపర్తి, తదుపరి ఈ టార్చ్‌ను తెలంగాణలోని అన్ని 33 జిల్లాల హ్యాకథాన్ జిల్లా ప్రతినిధులకు అందజేయనున్నారు. జిల్లా కలెక్టర్లు మరియు స్థానిక పరిపాలన సమన్వయంతో ఈ టార్చ్ ప్రతి జిల్లాలో యువత, విద్యార్థులు, క్రీడాకారులు మరియు ఇన్నోవేటర్లలో క్రీడాస్ఫూర్తి మరియు ఆవిష్కరణ ఆలోచనలను ప్రోత్సహించే లక్ష్యంతో కొనసాగనుంది.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రయాణించిన అనంతరం స్పోర్ట్స్ హ్యాకథాన్ టార్చ్ మార్చి 28న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియానికి చేరుకుని స్పోర్ట్స్ హ్యాకథాన్ మహోత్సవ ప్రారంభానికి నాంది పలుకుతుంది. ఇన్నోవేషన్ నుండి స్పోర్ట్స్ వరకు సాగుతున్న ఈ టార్చ్ ప్రయాణం తెలంగాణను క్రీడా ఆధారిత ఆవిష్కరణలకు కేంద్రంగా నిలపడంతో పాటు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినివ్వనున్నదని నిర్వాహకులు తెలిపారు.

తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







