పాలస్తీనియన్ల డిస్ ప్లేస్మెంట్.. తిరస్కరించిన సౌదీ అరేబియా..!!
- April 13, 2025
అంటల్య: పాలస్తీనియన్ల బలవంతపు తరలింపును సంబంధించిన ఏ ప్రతిపాదననైనా తిరస్కరిస్తామని సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ తేల్చిచెప్పారు. గాజా నివాసితులు జీవితంలోని ప్రాథమిక అవసరాలను కోల్పోతున్నారని ఆయన స్పష్టం చేశారు.
టర్కీలోని అంటాల్యలో జరిగిన గాజాపై యుద్ధాన్ని ముగించడానికి అంతర్జాతీయ జోక్యం కోసం ఏర్పాటైన మంత్రివర్గ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాలస్తీనియన్లను వారి భూమి నుండి తొలగించడాన్ని సౌదీ అరేబియా తిరస్కరించిందని ప్రిన్స్ ఫైసల్ పునరుద్ఘాటించారు.
గాజాలోకి మానవతా సహాయం అడ్డుకోవడం, కాల్పుల విరమణ ప్రయత్నాలను ఆయన విమర్శించారు. ఆటంకం లేకుండా సహాయాన్ని అందించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేయాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. ఈజిప్ట్, ఖతార్ నేతృత్వంలోని మధ్యవర్తిత్వ ప్రయత్నాలను ప్రశంసించారు. అనంరతం గాజా, వెస్ట్ బ్యాంక్ లేదా తూర్పు జెరూసలేం నుండి పాలస్తీనియన్లను బలవంతంగా తరలించడం లేదా బహిష్కరించడాన్ని ఖండిస్తూ సమావేశంలో తీర్మానం చేశారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







