వాహనదారులకు అలెర్ట్..ఇక AI-ఆధారిత కెమెరాలు ఫోకస్..!!
- April 13, 2025
మస్కట్: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడకం రోడ్డు భద్రతకు ముప్పు కలిగించే ప్రధాన సవాళ్లలో ఒకటి. ఇది వాహనదారుల ప్రాణాలతోపాటు ఇతర వాహనదారులకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాగా, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడకం వంటి ఉల్లంఘనలను గుర్తించడానికి రాయల్ ఒమన్ పోలీసులు అధునాతన స్మార్ట్ సిస్టమ్‌లను అమలు చేయడం ప్రారంభించారని రాయల్ ఒమన్ పోలీస్ ట్రాఫిక్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ ఇంజనీర్ అలీ బిన్ హమౌద్ అల్-ఫలాహి అన్నారు.
AI-ఆధారిత కెమెరాలు ఇప్పుడు పనిచేస్తున్నాయని, అవి ఫోటోలను సమర్థంగా విశ్లేషించగలవని తెలిపారు. అధిక ఖచ్చితత్వంతో ఉల్లంఘనలను గుర్తించగలవని పేర్కొన్నారు. ఈ వ్యవస్థలు ట్రాఫిక్ ను పర్యవేక్షించడానికి సహాయపడతాయని, ఇప్పటికే వీటిని ఒమన్ రోడ్లపై విస్తృతంగా పరీక్షించినట్లు వివరించారు. ఇటువంటి సాంకేతికతలు ఉల్లంఘనలు, ప్రమాదాలను సమర్థవంతంగా తగ్గిస్తాయని బ్రిగేడియర్ అల్-ఫలాహి ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- గిన్నిస్ రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య!
- కువైట్ లో ది లీడర్స్ కాన్క్లేవ్..!!
- సౌదీలో 23,094 మంది అరెస్టు..!!
- బహ్రెయిన్ లో మెసేజ్ స్కామ్స్ పెరుగుదల..!!
- ప్రపంచ శాంతికి ఖతార్ కృషి..!!
- బర్నింగ్ డాల్ ట్రెండ్ పై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- ROHM లో స్టార్ డయానా హద్దాద్ కాన్సర్ట్..!!
- దోహా చర్చలతో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి ఒప్పందం
- శంకర నేత్రాలయ USA తమ 'అడాప్ట్-ఎ-విలేజ్' దాతలకు అందిస్తున్న ఘన సత్కారం
- నవంబర్ 14, 15న సీఐఐ భాగస్వామ్య సదస్సు–ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు సమీక్ష