మక్కాలోకి ప్రవేశం.. తస్రీహ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- April 15, 2025
రియాద్: సౌదీ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ (SDAIA) భాగస్వామ్యంతో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. హజ్ పర్మిట్ల కోసం తస్రీహ్ అనే యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఈ పర్మిట్‌లను కలిగి ఉన్న దేశీయ, అంతర్జాతీయ యాత్రికులు మక్కా, పవిత్ర స్థలాలలోకి ప్రవేశించడానికి పర్మిట్‌లను జారీ చేయనున్నారు. నుసుక్ ప్లాట్‌ఫామ్ ద్వారా హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖతో టెక్నాలజీ షేరింగ్ కారణంగా ఇది పనిచేయనుందని అధికారులు తెలిపారు. దీనిద్వారా హజ్ కార్యకలాపాలలో పాల్గొనే కార్మికులు, స్వచ్ఛంద సేవకులు, అలాగే వాటిని రవాణా చేసే వాహనాలకు మక్కా, పవిత్ర ప్రదేశాలలోకి ప్రవేశించడానికి తవక్కల్నా యాప్ ద్వారా అనుమతులను పొందవచ్చు. ఈ యాప్ హజ్‌లో పాల్గొన్న ప్రభుత్వం, సేవా సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. ఇది సౌదీ విజన్ 2030 కార్యక్రమాలలో ఒకటైన డోయోఫ్ అల్-రెహ్మాన్ ప్రోగ్రామ్ లక్ష్యాలను నెరవేరుస్తుందని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- గిన్నిస్ రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య!
- కువైట్ లో ది లీడర్స్ కాన్క్లేవ్..!!
- సౌదీలో 23,094 మంది అరెస్టు..!!
- బహ్రెయిన్ లో మెసేజ్ స్కామ్స్ పెరుగుదల..!!
- ప్రపంచ శాంతికి ఖతార్ కృషి..!!
- బర్నింగ్ డాల్ ట్రెండ్ పై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- ROHM లో స్టార్ డయానా హద్దాద్ కాన్సర్ట్..!!
- దోహా చర్చలతో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి ఒప్పందం
- శంకర నేత్రాలయ USA తమ 'అడాప్ట్-ఎ-విలేజ్' దాతలకు అందిస్తున్న ఘన సత్కారం
- నవంబర్ 14, 15న సీఐఐ భాగస్వామ్య సదస్సు–ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు సమీక్ష