బహ్రెయిన్‌లో ఘనంగా తమిళ నూతన సంవత్సర వేడుకలు..!!
- April 15, 2025
మనామా: బహ్రెయిన్‌లోని శ్రీలంక క్లబ్ సింహళ స్కూల్.. శ్రీలంక ఇంజనీరింగ్ సొసైటీ బహ్రెయిన్‌తో కలిసి ఏప్రిల్ 11న బార్బర్‌లోని అబు నెజార్ స్విమ్మింగ్ పూల్ ప్రాంగణంలో సింహళ, తమిళ నూతన సంవత్సర వేడుకలను నిర్వహించింది. బహ్రెయిన్‌లోని శ్రీలంక రాయబార కార్యాలయ అధికారులు, వెయ్యి మందికి పైగా శ్రీలంక ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జాతీయ గీతాలు, సింహళ పాఠశాల పిల్లలు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నూతన సంవత్సర వేడుకల సమయంలో శ్రీలంక ఆహార పదార్థాలతో కూడిన అల్పాహార టేబుల్ ను ప్రదర్శించారు. అనంతరం చిన్నారులకు అనేక రకాల గేములను నిర్వహించారు. చివరగా వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి నిర్వాహకులు బహుమతులు అందజేశారు.
తాజా వార్తలు
- గిన్నిస్ రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య!
- కువైట్ లో ది లీడర్స్ కాన్క్లేవ్..!!
- సౌదీలో 23,094 మంది అరెస్టు..!!
- బహ్రెయిన్ లో మెసేజ్ స్కామ్స్ పెరుగుదల..!!
- ప్రపంచ శాంతికి ఖతార్ కృషి..!!
- బర్నింగ్ డాల్ ట్రెండ్ పై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- ROHM లో స్టార్ డయానా హద్దాద్ కాన్సర్ట్..!!
- దోహా చర్చలతో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి ఒప్పందం
- శంకర నేత్రాలయ USA తమ 'అడాప్ట్-ఎ-విలేజ్' దాతలకు అందిస్తున్న ఘన సత్కారం
- నవంబర్ 14, 15న సీఐఐ భాగస్వామ్య సదస్సు–ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు సమీక్ష