బహ్రెయిన్-జిసిసి మధ్య కార్మిక సహకారం..!!
- April 18, 2025
మనామా: జిసిసి రాష్ట్రాలలోని కార్మిక, సామాజిక వ్యవహారాల మంత్రుల మండలి ఎగ్జిక్యూటివ్ బ్యూరో డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ బిన్ హసన్ అల్ ఒబైద్లీని బహ్రెయిన్ న్యాయ వ్యవహారాల మంత్రి, తాత్కాలిక కార్మిక మంత్రి యూసిఫ్ బిన్ అబ్దుల్హుస్సేన్ ఖలాఫ్ ఘనంగా స్వాగతం పలికారు. వీరిద్దరి మధ్య జరిగిన సమావేశంలో పరస్పర సహకారాన్ని పెంపొందించే మార్గాలను సమీక్షించారు. ఉమ్మడి జిసిసి ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడంలో ఎగ్జిక్యూటివ్ బ్యూరో తనదైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. జిసిసి కార్మిక మార్కెట్లలో వృద్ధిని కొనసాగించడం, నైపుణ్య మార్పిడిని ప్రోత్సహించడం, సభ్య దేశాలలోని ప్రైవేట్ రంగ సంస్థలలో జాతీయ మానవ వనరుల అభివృద్ధి, ఉపాధిలో విజయవంతమైన ప్రయోజనాలను విస్తరించడంపై కూడా ఇరువురు చర్చించారని అధికార యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







