చికెన్‌ ఖాస్‌

- July 07, 2016 , by Maagulf
చికెన్‌ ఖాస్‌

కావలసినవి: ఒక కేజీ కోడి, 150 గ్రాముల వెన్న, పావుకేజీ ఉల్లిపాయలు, రెండు మూడు స్పూన్ల కారం, రెండు టేబుల్‌ స్పూన్ల టమోటా కెచప్‌, పావుకేజీ తాజా క్రీమ్‌, తగినంత ఉప్పు

ఎలా చేయాలి
చికెన్‌ను పెద్ద ముక్కలుగా కోసుకుని కడిగి పెట్టుకోండి. దానిలో రెండు కప్పుల నీళ్ళు, ఉప్పు వేసి ఉడికించండి. ఉడికాక మిగిలిన నీళ్ళను పక్కన తీసి పెట్టుకోండి. కడాయిని పొయ్యి మీద పెట్టి వెన్నవేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు మొత్తం వేసి వేగించండి. సగం పక్కన పెట్టి మిగతా సగంలో చికెన్‌, కారం, టమోటా కెచప్‌ వేయండి. బ్రౌన్‌ రంగు వచ్చేదాకా వేగించి మిగిలిన చికెన్‌ నీళ్ళలో క్రీం కలిపి దానిలో వేయండి. పక్కన పెట్టిన వేగించిన ఉల్లిపాయల్ని కూరమీద చల్లండి. దీన్ని నాన్‌లు, పరోటాలతో కలిపి తింటే బాగుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com