ప్రపంచ బాషలలో సంపూర్ణ శ్రీ మద్భగవద్గీత ను రూపొందించడమే లక్ష్యం
- April 22, 2025
పాలకొల్లు: ప్రపంచ బాషలలో సంపూర్ణ శ్రీ మద్భగవద్గీత ఆడియో ను రూపొందించడమే తన లక్ష్యమని , ఇప్పటికే 25 భాషల్లో రికార్డింగ్ పూర్తి అయ్యిందని , శ్రీ మద్భగవద్గీత యూట్యూబ్ , ఇతర మాధ్యమాల ద్వారా ఉచితంగా వినవచ్చునని, పల్లె పల్లె కు, గుండె గుండె కు , ఖండఖండాతరాలకు గీతను చేర్చాలన్నదే నా ఆశయమని శ్రీ మద్భగవద్గీత తెలుగు ఆడియో లోకార్పణ సభలో డా.గజల్ శ్రీనివాస్ అన్నారు.తన స్వస్థలమైన పాలకొల్లు లయన్స్ కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన గీత ఆవిష్కరణ సభలో డా.గజల్ శ్రీనివాస్ తండ్రిగారు కేశిరాజు నరసింహారావు (93) చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ స్వరపరిచి, గానం చేసిన శ్రీ మద్భగవద్గీత ఆవిష్కరణ జరిగింది.
ఈ సభలో పూర్వ శాసన సభ్యులు డా.సి.హెచ్.సత్య నారాయణ మూర్తి, పూర్వ శాసన మండలి సభ్యులు అంగర రామ మోహన్, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ అధ్యక్షులు గుమ్మడి గోపాలకృష్ణ, కళారత్న రసరాజు, రోటరీ అంతర్జాతీయ డైరెక్టర్ డా. వడ్లమాని రవి ,సేవ్ టెంపుల్స్ భారత్ సభ్యులు మేడికొండ శ్రీనివాస్, అడ్డాల వాసుదేవరావు, ముచ్చర్ల సత్య నారాయణ, విఠకుల రమణ, రెడ్డప్ప ధవీజీ , మాంటిస్సోరి వర్మ,తటవర్తి కృష్ణ మూర్తి , స్థానిక పెద్దలు , పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ సభలో పాల్గొని డా.గజల్ శ్రీనివాస్ గీతా గాన యాజ్ఞాన్ని అభినందించారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







