సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!
- December 15, 2025
రియాద్: సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాలలో లబ్ధిదారులకు మొదటి దశ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ను డెవలప్‌మెంటల్ హౌసింగ్ ఫౌండేషన్ (సకాన్) ప్రారంభించింది. క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ తన వ్యక్తిగత నిధుల నుండి జూద్ హౌసింగ్ ఇనిషియేటివ్ ద్వారా ఫౌండేషన్‌కు SR 1 బిలియన్ విరాళం అందించిన తర్వాత, ఆయన ఆదేశాలకు అనుగుణంగా ఈ యూనిట్ల కేటాయింపు జరుగుతోంది.
ఇందులో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు హౌజింగ్ యాజమాన్యాన్ని అందిస్తున్నారు. ఇది పౌరులకు గౌరవప్రదమైన జీవితాన్ని అందిస్తుందని తెలిపారు. కేటాయించిన గృహ ప్రాజెక్టులను 12 నెలల కాలంలో పూర్తి చేయడానికి కృషి చేయాలని క్రౌన్ ప్రిన్స్ ఆదేశించారు.
డెవలప్‌మెంటల్ హౌసింగ్ ఫౌండేషన్ (సకాన్) అనేది సొంతింటిని సొంతం చేసుకునే ప్రక్రియను సులభతరం చేసే ఒక కార్యక్రమం. ఇది తక్కువ ధరలకే హౌజింగ్ యూనట్లను అందిస్తుంది. అవసరమైన వారికి ఆర్థిక సహాయం కూడా అందజేస్తుదని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!
- మస్కట్ మునిసిపాలిటీ చేతికి ఒమన్ బొటానిక్ గార్డెన్..!!
- షేక్ తమీమ్ అవార్డుల విజేతలను సత్కరించిన అమీర్..!!
- 14 రోజుల్లో 21 ఆస్తులకు విద్యుత్ నిలిపివేత..!!
- యూఏఈలో తొలి లైసెన్స్ స్పోర్ట్స్ బెట్టింగ్ పోర్టల్..!!
- ప్రారంభమైన హెచ్ 1బీ, సోషల్ మీడియా స్క్రీనింగ్..







