పోప్ రేసులో ఉన్న కార్డినల్స్ వీరే!

- April 22, 2025 , by Maagulf
పోప్ రేసులో ఉన్న కార్డినల్స్ వీరే!

క్యాథలిక్ అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ 88 ఏళ్ల వయసులో సోమవారం రోజు ఉదయం పలు అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే పోప్ ఫ్రాన్సిస్ మృతి తర్వాత నుంచి కొత్త పోప్ ఎవరు అనే విషయంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలైంది. అసలీ ఎన్నిక ఎలా సాగుతుంది, ఈసారి పోప్‌గా ఎన్నికయ్యేందుకు ఎవరెవరు పోటీ చేసే అవకాశం ఉందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎన్నికల్లో క్యాథలిక్ లు ఎవరైనా పాల్గొనే అవకాశం ఉన్నప్పటికీ చాలా కాలంగా కార్డినల్స్ నుంచే పోక్‌ను ఎన్నుకుంటూ వస్తున్నారు. అత్యంత రహస్యంగా సాగే ఈ ఎన్నికలో ఈ ఐదుగురు కార్డినల్స్ పోటీ చేయబోతున్నారని వీరిలోంచే ఒకరు పోప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. 

కార్డినల్ పీట్రో పరోలిన్
కార్డినల్ పీట్రో పరోలిన్ ఇటలీ దేశస్థుడు. అయితే పోప్ ఫ్రాన్సిస్ తర్వాత పోప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్న, అందరూ ఇష్టపడే వ్యక్తి ఈయనేనని తెలుస్తోంది. ప్రస్తుతం 70 ఏళ్ల వయసు కల్గిన ఈయన గతంలో పోప్ సెక్రటరీగా పని చేశారు. దీంతో ఆయనకు వాటికన్‌తో పాటు దౌత్యపరమైన సంబంధాలు కూడా బాగానే ఉన్నాయి. ముఖ్యంగా చైనా, మిడిల్ ఈస్ట్ దేశాలతో కూడా పీట్రో పరోలిన్ సున్నితమైన చర్చల్లో పాల్గొన్నారు.

కార్డినల్ పీటర్ టర్క్‌సన్..
కార్డినల్ పీటర్ టర్క్‌సన్ ఘనా దేశానికి చెందిన వ్యక్తి. అయితే ప్రస్తుతం 76 ఏళ్ల వయసు కల్గిన ఈయనకు పోప్ ఫ్రాన్సిస్ వారసుడు అయ్యే అవకాశం ఉన్నట్లు అనేక మంది భావిస్తున్నారు. ఆఫ్రికాలో క్యాథలిక్ ల సంఖ్య పెరుగుతుడండంతో ఆ ఖండానికి చెందిన వ్యక్తినే పోప్‌గా నియమించాలన్న డిమాండ్లు వస్తుండగా పీటర్ టర్క్‌సన్‌కు ఈ అవకాశం దక్కుతుందని అనుకుంటున్నారు. కార్డినల్ పీటర్ టర్క్‌సన్‌కు హోమోసెక్స్, సామాజిక న్యాయం, ఎకాలజీ వంటి అంశాలపై లిబరల్ అభిప్రాయాలు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com