OTTలోకి ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ ఎప్పుడంటే!
- April 22, 2025
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ నిర్మాణంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం మ్యాడ్ స్క్వేర్. మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రాగా మొదటి పార్ట్‌లో నటించిన జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్‌తో పాటు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా నాగవంశీ నిర్మించాడు. ఏప్రిల్ 01న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్‌ను అందకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘నెట్‌ఫ్లిక్స్’లో ఈ నెల 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీలో ఈ చిత్రం సందడి చేయనుంది.
కథ
ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న మనోజ్ (నార్నే నితిన్), అశోక్ (రామ్ నితిన్), దామోదర్ (సంగీత్ శోభన్)ముగ్గురు కాలేజీ నుంచి బయటకు వచ్చిన మూడు సంవత్సరాల తర్వాత లడ్డు అలియాస్ గణేష్ (విష్ణు) పెళ్లిలో కలుస్తారు.అతను తమను పెళ్లికి పిలవకపోయినా, ముగ్గురు స్నేహితులు పెళ్లికి వెళ్లటంతో ఊహించని పరిణామాలు మొదలవుతాయి.అనుకోకుండా లడ్డూ పెళ్లి రద్దవుతుంది. అయితే పెళ్లి ఆగిపోయినా, అతను హనీమూన్ కు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అతనితో కలిసి మనోజ్, అశోక్, దామోదర్ కూడా గోవా వెళతారు. అక్కడ, ఓ మ్యూజియంలో గోల్డ్ చైన్ దొంగతనం కేసులో ఇరుక్కుంటారు. ఇదే కాదు, లడ్డూ తండ్రి (మురళీధర్ గౌడ్) భాయ్ (సునీల్) చేతిలో కిడ్నాప్ అవుతాడు. ఈ లోగా, గోవాలో లైలా (ప్రియాంక జువాల్కర్) అనే అమ్మాయి కనిపిస్తుంది. ఆమె కోసం అందరూ వెతకడం మొదలు పెడతారు. చివరకు గోల్డ్ చైన్ దొంగతనం కేసు నిజంగా ఎవరు చేశారు? లడ్డూ తండ్రిని ఎలా విడిపించారు? అన్న ప్రశ్నలకు సమాధానం ఈ కథలో దొరుకుతుంది.
విశ్లేషణ ఈ సినిమా మేకర్స్ ముందు నుంచి చెబుతున్నట్లుగా ఈ చిత్ర కథలో ఎటువంటి లాజిక్‌లు లేవు. వినోదమే ప్రధానంగా సన్నివేశాలను రాసుకున్నాడు దర్శకుడు. లడ్డూ పెళ్లి ఏపిసోడ్స్‌కు సంబంధించిన ఎంటర్‌టైన్‌మెంట్ అందర్ని అలరించే విధంగా ఉంది. సినిమాలో కొన్ని సన్నివేశాలు బోరింగ్‌గా, సాగతీతగా అనిపించినా, తదుపరి సన్నివేశంలో వచ్చే హిలేరియస్ ఫన్ కవర్ చేసింది. ముఖ్యంగా యూత్‌ను టార్గెట్‌గా దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!