ప్రపంచ వేదికపై మెరిసిన హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం..!!
- April 24, 2025
దోహా: ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) వరల్డ్ నివేదిక ప్రకారం.. 2024లో అంతర్జాతీయ ప్రయాణికులకు అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటిగా గుర్తింపు పొందిన హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం (HIA) ప్రపంచ వేదికపై తన ప్రముఖ స్థానాన్ని నిలుపుకుంది. విమానాశ్రయ నిర్వహణ, కార్యకలాపాలలో ఉన్నత ప్రమాణాలను ప్రోత్సహించడంలో ACI వరల్డ్ కీలక పాత్ర పోషిస్తుంది.
2024లో దోహాలో ఎక్కిన, దిగిన అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 52,714,976కి చేరుకుందని ఆ సంస్థ నివేదిక తెలిపింది. ఇది 2023 నుండి 14.8% పెరుగుదల అని, 2019తో పోలిస్తే 35.9% పెరుగుదలను ప్రతిబింబిస్తుందని, అవార్డు గెలుచుకున్న విమానాశ్రయాన్ని ప్రపంచంలోని టాప్ టెన్‌లో పెట్టిందని వెల్లడించింది.
2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4,300 అంతర్జాతీయ విమానాశ్రయాలు, అంతర్జాతీయ విమానాలను నిర్వహించడానికి కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ సౌకర్యాలతో ఏర్పాటు చేసి ఉన్నాయని, తద్వారా ప్రపంచ ప్రయాణం, కనెక్టివిటీ మెరుగుపడుతుందని తెలిపింది.
ఎయిర్ కార్గోలో HIA పనితీరు మెరుగుపడిందని ACI ప్రివ్యూ తెలిపింది. HIA 2024లో మొత్తం 2,616,849 మెట్రిక్ టన్నుల సరుకును లోడ్ చేసి అన్‌లోడ్ చేయడంతో ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే కార్గో విమానాశ్రయాలలో ఎనిమిదవ స్థానంలో నిలిచింది. ఈ సంఖ్య 2023 నుండి 11.1% పెరుగుదల కాగా, 2019తో పోలిస్తే 18.1% పెరుగుదలను నమోదు చేసింది.
ACI వరల్డ్ నివేదిక ప్రకారం.. 2024లో ప్రపంచ ఎయిర్ కార్గో వాల్యూమ్‌లు సంవత్సరానికి 8.4% పెరిగి, 124 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకున్నాయి. ఇది 2019తో పోలిస్తే 3.9% పెరుగుదల అని వెల్లడించింది.
టాప్ 10 ఎయిర్ ఫ్రైట్ గేట్‌వేలు 32.3 మిలియన్ టన్నులను నిర్వహించాయని, ఇవి ప్రపంచ వాల్యూమ్‌లలో దాదాపు 26% వాటా కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఎయిర్ కార్గో క్యారియర్‌లలో ఒకటైన ఖతార్ ఎయిర్‌వేస్ కార్గోకు కేంద్రంగా, HIA అధిక విలువ కలిగిన వస్తువులు, పాడైపోయే వస్తువులు సహా గణనీయమైన సరుకు రవాణాను నిర్వహిస్తుంది. విమానాశ్రయం అధునాతన కార్గో సౌకర్యాలు, సమర్థవంతమైన లాజిస్టిక్స్ , కస్టమ్స్ ప్రక్రియలతో తన పోటీతత్వాన్ని పెంచాయని ACI వరల్డ్ డైరెక్టర్ జనరల్ జస్టిన్ ఎర్బాచి తెలిపారు.
ACI ప్రాథమిక గణాంకాల ప్రకారం.. 2024లో ప్రపంచ ప్రయాణీకుల రద్దీ దాదాపు 9.5 బిలియన్లకు చేరుకుంది.ఇది 2023 నుండి 9% పెరుగుదల. 2019లో మహమ్మారికి ముందు స్థాయిల కంటే 3.8% పెరుగుదల నమొదైంది. టాప్ 10 రద్దీగా ఉండే విమానాశ్రయాలు 855 మిలియన్ల ప్రయాణీకులను నిర్వహించాయని, ఇది ప్రపంచ ట్రాఫిక్‌లో తొమ్మిది శాతం ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపింది.
2025లో ప్రపంచ ప్రయాణీకుల రద్దీ 4.8% వార్షిక వృద్ధి రేటుతో 9.9 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇటీవల స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగిన 2025 స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డులలో ప్రపంచంలోని ఉత్తమ విమానాశ్రయాలలో ఒకటిగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







