హైదరాబాద్ లో 208 మంది పాకిస్తానీయులు..
- April 25, 2025
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థానీయుల వీసాలు రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో హైదరాబాద్‌లో పాకిస్థానీయుల వివరాల పై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. స్పెషల్ బ్రాంచ్‌లో 208 మంది పాకిస్థానీయుల పేర్లు రిజిస్టర్ అయ్యాయి.
వీరిలో లాంగ్ టర్మ్ వీసా ఉన్నవాళ్లు 156 మంది, షార్ట్ టర్మ్ వీసా ఉన్నవాళ్లు 13 మంది, బిజినెస్ వీసాలతో ఉంటున్నవారు 39 మంది.కేంద్ర సర్కారు ఆదేశాల మేరకు వారంతా దేశం విడిచి వెళ్లి పోవాల్సి ఉంది. దీంతో స్పెషల్ బ్రాంచ్ అధికారులు అప్రమత్తమయ్యారు.
పాకిస్థాన్ ముర్దామాద్ నినాదాలు
మరోవైపు, పాకిస్థాన్ ముర్దామాద్ నినాదాలు, పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో ఇవాళ ముస్లింలు పాకిస్థాన్ ముర్దామాద్ నినాదాలు చేశారు. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా ముస్లింలు వేలాది సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. ఇవాళ శుక్రవారం కావడంతో..ఎంఐఎం చీఫ్ అసరుద్దీన్ ఒవైసీ పిలుపుమేరకు నల్ల రిబ్బన్లను ధరించి ముస్లింలు నమాజ్ చేశారు.
కాగా, పహల్గాం దాడికి ప్రతిస్పందనగా భారత్ ఉగ్రవాదాన్ని సమూలంగా అంతమొందించాలనే సంకల్పంతో ముందుకు వెళుతోంది. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ తక్షణమే దౌత్యపరమైన ఒత్తిడిని పెంచడమే కాకుండా, భవిష్యత్తులో పాకిస్థాన్ ఆర్థికంగా కోలుకోలేకుండా సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది.
అయినప్పటికీ, పహల్గాం ఘటనకు సంబంధించి నేరుగా ప్రమేయం ఉన్న ఉగ్రవాదులను శిక్షించాల్సిందేనని దేశవ్యాప్తంగా ప్రజల నుంచి గట్టిగా డిమాండ్ వస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌పై నేరుగా ఎలా ప్రతీకారం తీర్చుకోవచ్చన్నదే ఇప్పుడు ప్రధాన చర్చాంశంగా మారింది. సైనిక చర్య విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం చాలా సమగ్రంగా, జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఉంటున్న పాకిస్థానీయులను వెనక్కి పంపించాలని కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







