తెలంగాణ భవన్ వద్ద కలకలం..
- April 29, 2025
హైదరాబాద్: హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ వద్ద కలకలం రేగింది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కటౌట్ కి నిప్పు పెట్టేందుకు ఓ వ్యక్తి యత్నించాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే అతడిని అడ్డుకున్నారు.ఈ ఘటనలో కేసీఆర్ కటౌట్ స్వల్పంగా కాలింది.
దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కటౌట్ కి నిప్పు పెట్టేందుకు ఎందుకు యత్నించారో ఆరా తీశారు. కాగా, కేసీఆర్ కటౌట్ కి నిప్పు పెట్టిన వ్యక్తి.. మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. అతడిని తిరుపతి ప్రాంతానికి చెందిన రాజాగా గుర్తించారు.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







