'లెవెన్' గ్రిప్పింగ్ ట్రైలర్ విడుదల
- April 29, 2025
నవీన్ చంద్ర హీరోగా నటించిన బైలింగ్వల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఎలెవెన్. సుందర్ సి వద్ద కలకలప్పు 2, వంద రాజవతాన్ వరువేన్, యాక్షన్ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వం వహించారు. AR ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించిన లెవెన్, విమర్శకుల ప్రశంసలు పొందిన సిలా నేరంగలిల్ సిలా మణిధర్గల్, సెంబి చిత్రాల విజయం తర్వాత వారి మూడవ వెంచర్.
ఈ చిత్రం ఈ వేసవిలో అద్భుతమైన సినిమా ఎక్స్ పీరియన్స్ ని అందించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి.
ఉలగనాయకన్ కమల్ హాసన్ ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఒక మ్యాసీవ్ ఫైర్ యాక్సిడెంట్ తో మొదలైన ట్రైలర్ అవుట్ అండ్ అవుట్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది.
'లాస్ట్ ఇయర్ వైజాగ్ లో వరుసగా ఎనిమిది హత్యలు జరిగాయి. సీరియల్ కిల్లింగ్స్' అనే ఇంటెన్స్ డైలాగ్ తో పవర్ పుల్ పోలీస్ ఆఫీసర్ గా నవీన్ చంద్ర ఆ కేసుని పరిశోధించిన తీరు నెవర్ బిఫోర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. 'సైకో కిల్లర్ విత్ అన్ బిలివబుల్ ఐక్యూ'అనే డైలాగ్ సైకో కిల్లర్ క్యారెక్టర్ చుట్టూ సస్పెన్ ని మరింతగా పెంచింది.
నవీన్ చంద్ర ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్, సీరియల్ కిల్లింగ్ బ్యాగ్ డ్రాప్, డైరెక్టర్ లోకేశ్ అజ్ల్స్ గ్రిప్పింగ్ టేకింగ్ ట్రైలర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాయి.
సిలా నేరంగలిల్ సిలా మణిధర్గల్లో నటించిన రేయా హరి, ఎలెవెన్లో కథానాయికగా నటించింది. అభిరామి, రవివర్మ, కిరీటి దామరాజు ట్రైలర్ లో కీలక పాత్రలలో ఆకట్టుకున్నారు.
డి. ఇమ్మాన్ బీజీఎం , కార్తీక్ అశోకన్ సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్ లో వున్నాయి. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకాంత్ ఎన్.బి. ఎడిటింగ్ రెసీగా వుంది.
రుచిర ఎంటర్టైన్మెంట్స్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎన్ సుధాకర్ రెడ్డి ఈ సినిమా థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు.
ట్రైలర్ ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ పై అంచనాలని మరింతగా పెంచింది. మే 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







