ITEX 2025.. ఒమన్ కు ప్రాతినిధ్యం వహించే వారి వివరాలు వెల్లడి..!!
- April 30, 2025
సోహార్ : 2025 మే 29-31 తేదీలలో మలేషియాలోని కౌలాలంపూర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న అంతర్జాతీయ ఇన్నోవేషన్, సాంకేతిక ప్రదర్శన (ITEX 2025)లో ఒమన్ సుల్తానేట్‌కు ప్రాతినిధ్యం వహించే ముగ్గురు అర్హత సాధించినవారి పేర్లను ఉన్నత విద్య, పరిశోధన, ఇన్నోవేషన్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ప్రకటన కార్యక్రమం సోహార్ విశ్వవిద్యాలయంలో నార్త్ అల్ బటినా గవర్నర్ మొహమ్మద్ సులేమాన్ అల్ కిండి ఆధ్వర్యంలో జరిగింది. ఉన్నత విద్య, పరిశోధన, పరిశోధన, ఆవిష్కరణల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ సైఫ్ అబ్దుల్లా అల్ హద్దాబీ సమక్షంలో జరిగింది.
ఎంపిక చేసిన ముగ్గురు వివరాలు: “స్క్విడ్ ఇంక్ వాటర్ ఫిల్టర్” ప్రాజెక్ట్ కోసం యూస్రా యూసుఫ్ అల్ గదానీ, “పోర్ట్ ల్యాండ్ సిమెంట్ రీన్ఫోర్స్డ్ విత్ కార్బన్ నానోషీట్స్ యాజ్ ఎ డెంటల్ ఫిల్లింగ్” అనే ఆవిష్కరణ కోసం మలక్ ఖలీఫా అల్ హార్తీ, “రింగ్ మెయిన్ యూనిట్ ఆపరేషన్ కోసం రిమోట్ కంట్రోల్ డివైస్” ప్రాజెక్ట్ కోసం బదర్ సలీం అల్ ముక్బాలి లు ఎంపికైనట్టు ప్రకటించారు.
ఈ ప్రదర్శనలో ఆసియా, యూరప్‌లోని 20 కి పైగా దేశాల నుండి పాల్గొంటున్నారు. వివిధ వర్గాలలో 1,000 కి పైగా ఆవిష్కరణలను ప్రదర్శిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







