తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల..
- April 30, 2025
హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. జీపీఏ ఈ సారి తొలగించడంతో సబ్జెక్టుల వారీగా మార్కుల గ్రేడ్లు ఇచ్చారు.
ఉత్తీర్ణతకు కావాల్సిన మార్కులు వస్తే పాస్ అని మోమోపై ఉంటుంది. ఉత్తీర్ణత సాధించలేకపోతే ఫెయిల్ అని అందులో ఇచ్చారు. ఇంతకు ముందు సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ విధానాన్ని పాటించిన విషయం తెలిసిందే.
టెన్త్ ఫలితాల్లో 92.78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాది కంటే 1.47 శాతం ఉత్తీర్ణత అధికంగా ఉంది. ప్రైవేటు స్కూళ్లలో 94.21 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఒక్క విద్యార్థి కూడా పాస్ కాని పాఠశాలలు రెండు ఉన్నాయి.
ప్రైవేటు స్కూళ్లలో గత ఏడాది కంటే ఈ సారి 4 శాతం అధికంగా ఉత్తీర్ణత నమోదైంది. గురుకుల పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం 98.7గా ఉంది. కాగా, మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరిగాయి. పరీక్షలను 5,09,403 మంది విద్యార్థులు రాశారు.
అధికారిక వెబ్‌సైట్లు
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!