ఉక్రెయిన్ జర్నలిస్ట్ విక్టోరియాకు జోహార్లు

- May 01, 2025 , by Maagulf
ఉక్రెయిన్ జర్నలిస్ట్ విక్టోరియాకు జోహార్లు

ఉక్రెయిన్: కిడ్నాప్ కు గురైన డేరింగ్ డాషింగ్ యువ జర్నలిస్ట్ విక్టోరియా భౌతికకాయం బ్యాగ్ లో తిరిగి ఉక్రెయిన్ కు పంపించాయి రష్యా బలగాలు! కానీ, ఆమె కళ్ళు, మెదడు, స్వర పేటిక లేవని డైలీ మెయిల్ పత్రిక వెల్లడించింది! ఇది దురదృష్టకరం, చాలా విచారకరం! ప్రపంచ వ్యాప్తంగా జర్నలిస్టులకు బ్లాక్ డే! 

ఉక్రెయిన్ యుద్దాన్ని, అక్కడి రష్యన్ బలగాల ఘోరాన్ని ఎప్పటికప్పుడు సాహసోపేతంగా ప్రపంచానికి తెలియచేసిన జర్నలిస్ట్ విక్టోరియా రోస్చినాను రష్యన్ సైనికులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే! నిన్న ఆమె భౌతిక కాయాన్ని బ్యాగులో కుక్కి ఉక్రెయిన్ కు పంపించారు! రష్యా జైలులో ఆమెను దారుణంగా చిత్రహింస కు గురి చేసినట్లు ఆమె భౌతికకాయాన్ని చూస్తే అర్ధమవుతున్నదని ఉక్రెయిన్ సైనికాధికారి వివరించారు. రష్యన్ దళాల దారుణ హింస బయటకు రాకుండా ఉండేందుకు ఆమె మెదడు, కళ్ళు తొలగించి ఉండొచ్చని కైవ్ లోని అధికారులు ప్రకటించారు. 

మానవ హక్కుల ఉల్లంఘనలను దాచేందుకు పరిమితులకు మించి హింసించిన ఖైదీల శరీర భాగాలను తొలగించడం రష్యాలో ఉన్న ఒక సర్వ సాధారణ విషయం! ఉజ్వల భవిష్యత్ వున్న జర్నలిస్ట్ విక్టోరియా 27 ఏళ్లకే ఇలా దారుణ హింసకు గురై చివరకు ప్రాణాలు కోల్పోయి బాడీ బ్యాగ్ లో వెనక్కి రావడం ఘోరమైన చర్య! ప్రతి ఒక్కరూ ముక్తకంఠం తో ఖండించాలి. ఇప్పటికే ఉత్తమ జర్నలిస్టుగా అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ధైర్యమైన ధీర విక్టోరియాకు జోహార్లు, నివాళి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com