నకిలీ ప్లేట్ వినియోగం..వ్యక్తి అరెస్టు.. Dh104,000 జరిమానా..!!
- May 02, 2025
షార్జా: ట్రాఫిక్ సీసీ కెమెరాలను తప్పించుకోవడానికి తన వాహనంపై నకిలీ లైసెన్స్ ప్లేట్లను అమర్చిన ఒక వాహనదారుడిని అరెస్టు చేసినట్లు షార్జా పోలీసులు వెల్లడించారు. నిందితుడిని విచారించగా.. ఆ వ్యక్తి వాహనంపై 137 ట్రాఫిక్ ఉల్లంఘనలు, Dh104,000 జరిమానాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వాహనదారుడిపై 308 ట్రాఫిక్ పాయింట్లు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
షార్జా పోలీసుల ట్రాఫిక్, పెట్రోల్స్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ ఒమర్ మొహమ్మద్ బు ఘనేమ్ మాట్లాడుతూ.. ఫీల్డ్ ట్రాఫిక్ అధికారులు, కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ బృందం మధ్య మెరుగైన సమన్వయం ఫలితంగా సదరు వ్యక్తి చేసిన మోసాన్ని గుర్తించి, అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఎమిరేట్ లోని రహదారులపై ఉన్న అధునాతన భద్రతా నిఘా వ్యవస్థల కారణంగా సదరు వాహనాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు.
నకిలీ ప్లేట్లను అమర్చడం , నంబర్లను కనిపించకుండా చేయడం వంటి కొన్ని డ్రైవర్ ప్రవర్తనలు కేవలం ట్రాఫిక్ నేరాలు మాత్రమే కాదని, చట్టపరమైన క్రిమినల్ కేసులుగా మారవచ్చని ఆయన హెచ్చరించారు. ఇలాంటి ప్రవర్తనలను సహించేది లేదని కల్నల్ బు ఘనేమ్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







