నిషేధిత మెడిసిన్స్.. ప్రయాణీకుడికి 2 ఏళ్ల జైలుశిక్ష, 100,000 దిర్హామ్‌ల జరిమానా..!!

- May 04, 2025 , by Maagulf
నిషేధిత మెడిసిన్స్.. ప్రయాణీకుడికి 2 ఏళ్ల జైలుశిక్ష, 100,000 దిర్హామ్‌ల జరిమానా..!!

దుబాయ్: దుబాయ్ క్రిమినల్ కోర్టు 45 ఏళ్ల ఆసియా వ్యక్తికి రెండు సంవత్సరాల జైలు శిక్ష, 100,000 దిర్హామ్‌ల జరిమానా విధించింది. అతని లగేజీలో వందలాది నిషేధిత మెడిసిన్స్ గుర్తించడంతో దుబాయ్ క్రిమినల్ కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు లగేజీ తనిఖీ సమయంలో 480 నిషేధం మెడిసిన్స్ గుర్తించి ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకున్నారు.దర్యాప్తులో ఆ వ్యక్తి వద్ద వాటిని కలిగి ఉండటానికి ఎటువంటి వైద్య పత్రాలు లేవని తేలిందని, ఆ వ్యక్తి తన స్వదేశం నుండి యూఏఈలోని వేరే వారికి డెలివరీ చేయడానికి ఆ మందులను తీసుకొచ్చినట్టు తెలిపాడని అధికారులు చెప్పారు. జైలు శిక్ష, జరిమానాతో పాటు, శిక్ష అనుభవించిన తర్వాత ఆ వ్యక్తిని దేశం నుండి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. విడుదలైన తర్వాత రెండు సంవత్సరాల పాటు యూఈఈ సెంట్రల్ బ్యాంక్ , అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇతరులకు డబ్బును బదిలీ చేయడం లేదా డిపాజిట్ చేయడం కూడా అతనిపై నిషేధం విధించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com