6 రూపాయల టికెట్ బ్లాక్ లో 210 రూపాయలకు కొన్న అభిమాని..
- May 04, 2025
ఇప్పుడంటే టికెట్ రేట్లు వందల్లో ఉంటున్నాయి కానీ ఒకప్పుడు టికెట్ రేట్లు రూపాయి నుంచి 10 రూపాయలు రేట్లు కూడా ఉండేవని తెలిసిందే. తాజాగా మెగాస్టార్ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు మూవీ యూనిట్.
మెగాస్టార్ చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మే 9న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను మూవీ యూనిట్ పంచుకుంటున్నారు. తాజాగా మూవీ యూనిట్ జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజయినప్పుడు ఈ సినిమా పెద్ద హిట్ అయి భారీ డిమాండ్ ఉండటంతో ఆరు రూపాయల టికెట్ ని 210 రూపాయలకు బ్లాక్ లో అమ్మారు అని అప్పటి పేపర్లో పడిన విషయాన్ని షేర్ చేసారు.
అప్పట్లో సూపర్ హిట్ సినిమాలకు బాగా డిమాండ్ ఉంటె ఫ్యాన్స్ బ్లాక్ లో టికెట్స్ కొనుక్కొని మరీ వెళ్లేవారు. అలా ఓ చిరంజీవి అభిమాని సినిమా చూడటానికి ఆరు రూపాయల టికెట్ 210 రూపాయలు పెట్టి కొనుక్కొని చూసాడంటే మాములు విషయం కాదు. అదీ కదా మెగాస్టార్ రేంజ్ అంటే.
చిరంజీవి, శ్రీదేవి జంటగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా సోషియో ఫాంటసీగా తెరకెక్కింది. 1990ల్లో 2 కోట్లు పెట్టి తీస్తే ఈ సినిమా అప్పట్లోనే 15 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మరి ఇప్పుడు రీ రిలీజ్ లో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఎన్ని రికార్డులు కొడుతుందో చూడాలి.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







