వార్షిక హజ్ సీజన్..రోడ్ నెట్‌వర్క్ అంతటా ప్రత్యేక బృందాలు..!!

- May 05, 2025 , by Maagulf
వార్షిక హజ్ సీజన్..రోడ్ నెట్‌వర్క్ అంతటా ప్రత్యేక బృందాలు..!!

మక్కా: వార్షిక హజ్ యాత్రా సీజన్ ప్రారంభం నేపథ్యంలో సౌదీ రోడ్ల జనరల్ అథారిటీ (RGA) యాత్రికులకు సురక్షితంగా ప్రయాణించేలా విస్తృతమైన సన్నాహాలు చేసినట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా  రోడ్ నెట్‌వర్క్ అంతటా ప్రత్యేక బృందాలను మోహరించినట్లు తెలిపింది.  ముందస్తు సన్నాహాలలో పవిత్ర స్థలాలను అనుసంధానించే అన్ని రోడ్లను తనిఖీలు పూర్తి చేసినట్లు వెల్లడించింది. 234.21 కి.మీ కొత్త రోడ్డు ప్రాజెక్టుల అమలు, 7,401.5 కి.మీ ఉన్న రోడ్ల నిర్వహణ, 125,591 రిఫ్లెక్టివ్ స్టడ్‌లు, 1,622 డైరెక్షనల్,  హెచ్చరిక సిగ్నల్స్ ఏర్పాటు, 24,255 కి.మీ రోడ్డు మార్కింగ్‌లు, 41.6 కి.మీ భద్రతా అడ్డంకుల ఏర్పాటు, ఐదు సర్కిళ్ల అప్‌గ్రేడ్, 150 లైటింగ్ స్తంభాల ఏర్పాటు, 247 వంతెనల సమగ్ర తనిఖీ, నిర్వహణ వంటి కీలక పనులు పూర్తయినట్లు పేర్కొంది.

భద్రత, పెరుగుతున్న ట్రాఫిక్ డిమాండ్ల నిర్వహణకు 300 రౌండ్-ది-క్లాక్ రోడ్ మానిటర్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఇందులో డ్యామేజ్ మ్యాపింగ్, స్కిడ్ రెసిస్టెన్స్ టెస్టింగ్, డీవియేషన్, థిక్నెస్ ఇన్‌స్పెక్షన్,  డ్రోన్ ఆధారిత అసెస్‌మెంట్‌లు, పెయింట్ నాణ్యత పరీక్షల కోసం పర్యవేక్షణ ఉంటుందని వెల్లడించారు.  ఈ ప్రయత్నాలు మౌలిక సదుపాయాల నాణ్యతలో సౌదీ అరేబియా ర్యాంకింగ్‌ను G20 దేశాలలో 4వ స్థానానికి, రోడ్డు కనెక్టివిటీలో ప్రపంచవ్యాప్తంగా 1వ స్థానానికి,  హెచ్చరిక వైబ్రేషన్ టెక్నాలజీల విషయంలో అరబ్ ప్రాంతంలో 1వ స్థానానికి పెంచాయని పేర్కొంది. 73,000 కి.మీ.లకు పైగా విస్తృతమైన రోడ్ నెట్‌వర్క్, దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతాలతో పవిత్ర స్థలాలను అనుసంధానించడంలో, ఆర్థిక, పర్యాటకంగా కీలక పాత్ర పోషిస్తాయన్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com