దుబాయ్ లో ప్రైవేట్ పార్కింగ్ ఫీజులు రెట్టింపు.. నియంత్రణకు డిమాండ్..!!
- May 07, 2025
యూఏఈ: దుబాయ్ లోని పలు ప్రాంతాల్లో ప్రైవేట్ పార్మింగ్ ఫీజులు రెట్టింపు అయినట్లు వాహనదారులు వాపోతున్నారు. వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అల్ వార్ఖాలో ఉంటూ, అల్ రాస్‌లో తన హోల్‌సేల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న బియ్యం వ్యాపారి హమీద్ హషీమ్ మాట్లాడుతూ.. పార్కింగ్ గతంలో కంటే ఖరీదైనదిగా మారిందని అన్నారు. ఇప్పుడు పార్కింగ్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. గత సంవత్సరం నవంబర్ వరకు, అతను RTA జోన్ A లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పార్కింగ్ చేయడానికి ప్రతిరోజూ Dh16 చెల్లించాడు. కానీ ఖాళీ స్థలం కోసం వెతకడానికి రోజూ దాదాపు గంట సమయం పట్టిందని అన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు డిసెంబర్‌లో సమీపంలోని ఒక ప్రైవేట్ పార్కింగ్ స్థలానికి మారినట్లు తెలిపాడు. అక్కడ రోజుకు Dh20 చెల్లించేవాడినని, కానీ మే 1న, అదే అటెండెంట్ రేటు రెట్టింపు అయిందని చెప్పనప్పుడు షాక్ అయినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు రోజుకు Dh40 లేదా నెలవారీ పాస్‌కు Dh650 అని అటెండెంట్ చెప్పినట్లు పేర్కొన్నారు.
ఇది ఒక్క హమీద్ సమస్యనే కాదు, డీరా అంతటా వ్యాపారులు, నివాసితులు, దుకాణదారులు ఇటీవలి వారాల్లో ప్రైవేట్ పార్కింగ్ ఫీజులు గణనీయంగా పెరిగాయని చెబుతున్నారు. కొన్ని స్థలాలలో ఇప్పుడు గంటకు Dh15 నుండి Dh35 వరకు వసూలు చేస్తున్నాయని అంటున్నారు.
RTA పబ్లిక్ పార్కింగ్ స్థలాలు నిరంతరం ఫుల్ కావడం, చాలా మంది వాహనదారులు స్థలం కోసం 30 నిమిషాల నుండి గంటకు పైగా పడుతుండటంతో ప్రైవేట్ పార్కింగ్ ప్రాంతాలకు డిమాండ్ పెరుగుతోంది. సమయం, ఇంధనాన్ని ఆదా చేసేందుకు అధిక పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నా.. వాహనదారులు ప్రైవేట్ స్థలాల వైపు మొగ్గు చూపుతున్నారు.
మరోవైపు గ్రేస్ పీరియడ్ లేకపోవడంపై వాహనదారులు ఫిర్యాదు చేస్తున్నారు. ఒక నిమిషం ఆలస్యమైనా అదనంగా గంట ఛార్జీ విధించబడుతుందని అంటున్నారు. అల్ మక్తూమ్ రోడ్‌లోని వారానికి రెండుసార్లు క్లినిక్‌ను సందర్శించే తల్లి ఫాతిమా మాట్లాడుతూ.. తన కారు వద్దకు కేవలం ఐదు నిమిషాలు ఆలస్యంగా తిరిగి వచ్చిన తర్వాత రెండు పూర్తి గంటలు ఛార్జీ విధించారని చెప్పారు. "నన్ను Dh15 కు బదులుగా Dh30 చెల్లించమని అడిగారు. గ్రేస్ పీరియడ్ ఎందుకు లేదని నేను అడిగినప్పుడు, అతను (అటెండర్) అరవడం ప్రారంభించాడు. నేను పూర్తిగా నిస్సహాయంగా భావించాను" అని ఆమె చెప్పింది.
ఇదిలా ఉండగా, పార్కింగ్ ఫీజుల పెంపుపై క్రీక్ రోడ్‌లోని ఒక లాట్ అటెండర్లను సంప్రదించగా, తమకు వేరే మార్గం లేదని పేర్కొంటున్నారు. తమకు అద్దె పెరిగిందని, కాబట్టి తాము రేట్లు పెంచాల్సి వచ్చిందంటున్నారు. కానీ ఎలాంటి అధికారిక నియంత్రణ లేకపోవడం వల్ల ఈ ఆపరేటర్లకు వాహనదారుల నుండి అధిక ఫీజులను వసూలు చేసే స్వేచ్ఛ లభిస్తుందని నివాసితులు అంటున్నారు. ప్రైవేట్ పార్కింగ్ ఫీజులు వేగంగా పెరుగుతున్నాయని, వేధింపుల నివేదికలు పెరుగుతున్నాయని, ప్రైవేట్ పార్కింగ్ స్థలాలను నియంత్రించడానికి అధికారులు జోక్యం చేసుకోవాలని నివాసితులు కోరుతున్నారు.
తాజా వార్తలు
- అమెరికన్ ప్రతినిధుల బృందంతో సీఎం భేటీ..
- ఏపీ: త్వరలో భారీగా పోలీస్ నియామకాలు..
- ట్రాన్స్జెండర్ల వేధింపులపై ట్వీట్: సీపీ సజ్జనార్
- చంద్రబాబు పేదవాడికి భవిష్యత్ లేకుండా చేస్తున్నారు – జగన్
- మిడిల్ ఈస్ట్ లో శాశ్వత శాంతి కోసం బహ్రెయిన్ పిలుపు..!!
- విషాదం..దుక్మ్ ప్రమాదంలో మరణించిన వ్యక్తుల గుర్తింపు..!!
- దుబాయ్-ఢిల్లీ ప్రయాణికులకు షాకిచ్చిన స్పైస్‌జెట్..!!
- GCC e-గవర్నమెంట్ అవార్డుల్లో మెరిసిన ఖతార్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనల పై భారీ జరిమానాలు..!!
- నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న సౌదీ శాస్త్రవేత్త ఒమర్ యాఘి..!!