ఇండియా-పాక్ టెన్షన్: తగ్గిన బంగారం ధరలు..!!
- May 08, 2025
యూఏఈ: గురువారం దుబాయ్‌లో మార్కెట్లు ప్రారంభమైన సమయంలో బంగారం ధరలు గ్రాముకు Dh9 తగ్గాయి. గురువారం ఉదయం 24 క్యారెట్ల బంగారం గ్రాముకు Dh404 వద్ద అమ్ముడైంది. బుధవారం మార్కెట్లు ముగిసే సమయానికి గ్రాముకు Dh409 వద్ద ఉంది. ఈ విలువైన లోహం ఇతర వేరియంట్లలో 22 క్యారెట్లు, 21 క్యారెట్లు మరియు 18 క్యారెట్లు వరుసగా గ్రాముకు Dh370.5, Dh355.25 మరియు Dh304.5కి పడిపోయాయి. బుధవారం రాత్రి ఫెడ్ సమావేశం తర్వాత US ఫెడరల్ రిజర్వ్ చీఫ్ జెరోమ్ పావెల్.. అమెరికా- చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తత సడలింపు కారణంగా స్పాట్ గోల్డ్ ఔన్సుకు $3,336.86 వద్ద ట్రేడయింది. చైనా వైస్ ప్రీమియర్ హీ లిఫెంగ్‌తో చర్చలు జరపడానికి ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ , అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ స్విట్జర్లాండ్‌కు వెళతారని వాషింగ్టన్, బీజింగ్ ప్రకటించాయి. ట్రంప్ పరిపాలన చైనాపై విస్తృత సుంకాలను అమలు చేసిన తర్వాత ఈ సమావేశం మొదటిసారి జరగడం గమనార్హం.
“దక్షిణాసియాలో రెండు అణ్వాయుధ దేశాలు భారతదేశం, పాకిస్తాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇవి బంగారం కొనుగోళ్లకు అనుకూలమైనవిగా భావిస్తున్నారు. ”అని సెంచరీ ఫైనాన్షియల్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ విజయ్ వాలెచా అన్నారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







