ఇక పై భారత్ మరింత చేరువకానుంది

- July 13, 2015 , by Maagulf
ఇక పై భారత్ మరింత చేరువకానుంది

శబ్ధవేగం కంటే మిన్నగా ప్రయాణం చేసే విమానం వచ్చేస్తోంది. గంటంటే గంటలో దుబాయ్ నుంచి భారత్‌కు చేర్చేస్తామని విమాన తయారీదారులు ధీమాగా చెబుతున్నారు.. ఎమిటి ఆ సంస్థ.. ? ఎప్పుడు వస్తుంది ఆ విమానం..? బోస్టన్‌లోని స్పైక్‌ ఏరోస్పేస్‌ కంపెనీ చెబుతోంది. ఈ దిశగా 'ఎస్‌-512' పేరిట ఓ సూపర్‌సోనిక్‌ (శబ్దంకన్నా వేగం) విమానాన్ని ఆ సంస్థ తయారు చేస్తోంది. గంటకు 2,200 కిలోమీటర్లవేగంతో ప్రయాణించే ఈవిమానం లండన్‌- న్యూయార్క్‌ల మధ్య 7గంటల ప్రయాణాన్ని 3 గం టలకు తగ్గించేస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. దుబాయ్ నుంచి కేవలం గంటలో ఇండియాలో ల్యాండయిపోతామట. దీన్ని రూపుదిద్దుతున్న ఇంజనీర్ల బృందంలో భారత సంతతి సాంకేతిక నిపుణులు కూడా ఉన్నారు. దీనికి అమర్చబోయే 'డెల్టా' రెక్కలవల్ల ఇంతటి వేగం సాధ్యమని వారు వివరించారు. ఈ విమానం తయారీకి రూ.380 కోట్ల నుంచి 506 కోట్ల మధ్య ఖర్చవుతుందని సంస్థ సీఈవో విక్‌ కచోరియా తెలిపారు. 

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com