వైద్యుడిని మోసం చేసిన వ్యక్తికి జైలు శిక్ష.. భారీ జరిమానా..!!
- May 09, 2025
దుబాయ్: వైద్య పార్టనర్ షిప్ పేరిట అరబ్ వైద్యుడి నుండి నిధులను దుర్వినియోగం చేసినందుకు దోషిగా తేలిన 48 ఏళ్ల యూరోపియన్ వ్యక్తికి దుబాయ్ మిస్‌డిమీనర్స్ కోర్టు ఒక నెల జైలు శిక్ష, 600,000 దిర్హామ్‌ల జరిమానా విధించింది. శిక్ష పూర్తయిన తర్వాత కోర్టు అతనిని బహిష్కరించాలని కూడా ఆదేశించింది. ఈ కేసు గత సంవత్సరం మే నెలలో నమోదైంది. దుబాయ్‌లో 600,000 దిర్హామ్‌ల అంచనా పెట్టుబడితో మల్టీ-స్పెషాలిటీ మెడికల్ సెంటర్‌ను స్థాపించడంలో భాగస్వామిగా ఉండాలనే ప్రతిపాదనతో ఆ వ్యక్తి ప్రతిపాదన చేసి అనంతరం మోసం చేశాడు.
దుబాయ్‌లో జరిగిన ఒక వైద్య ప్రదర్శన కలిసాడని, ఓ వెంచర్ ప్రతిపాదన చేసి, ప్రారంభ చెల్లింపుగా Dh400,000, ఆ తర్వాత మరొక Dh200,000 అతని వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు బదిలీ చేశారు. అయితే, నిధులు అందిన తర్వాత, ప్రాజెక్ట్ అతీగతి లేదని, డబ్బు తిరిగి చెల్లించడానికి నిరాకరించాడని ఆరోపించారు. దీనితో బాధితుడు అధికారులను సంప్రదించి అధికారికంగా ఫిర్యాదును దాఖలు చేశాడు. నిందితుడు డబ్బును తన వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నాడని అధికారులు గుర్తించి, కోర్టుకు నివేదిక సమర్పించారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







