సబా అల్-సేలంలో 22 మంది అరెస్టు..804 ఉల్లంఘనలు నమోదు..!!
- May 10, 2025
కువైట్: ట్రాఫిక్ ,ఆపరేషన్స్ వ్యవహారాల విభాగం, జనరల్ ట్రాఫిక్ విభాగం, జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెస్క్యూ పోలీస్, జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆపరేషన్స్, పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్, ప్రైవేట్ సెక్యూరిటీ సెక్టార్, మహిళా పోలీసులు సంయుక్తంగా చేపట్టిన తనిఖీలలో భారీగా ఉల్లంఘనలు నమోదైనట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సబా అల్-సేలం ప్రాంతంలో విస్తృతమైన భద్రతా , ట్రాఫిక్ తనిఖీలలో మొత్తం 804 ట్రాఫిక్ ఉల్లంఘనలను నమోదు చేశారని తెలిపారు. అలాగే నివాస, కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు 6 మంది, మోస్ట్ వాంటెడ్ 10 మంది, ఎటువంటి గుర్తింపు పత్రాలు టేని 5 మందితో సహా మొత్తం 22 మంది వ్యక్తులను అరెస్టు చేశారని పేర్కొన్నారు. దాంతోపాటు ఆరు వాహనాలను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. నివాసితులు భద్రతా సిబ్బందికి సహకరించాలని, ఏదైనా అనుమానాస్పద లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలను అత్యవసర నంబర్ 112 కు కాల్ చేయడం ద్వారా తెలియజేయాలని కోరారు.
తాజా వార్తలు
- ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు..
- సోనియా గాంధీకి కోర్టులో ఊరట
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!
- సివిల్ ఏవియేషన్ పై కువైట్, భారత్ చర్చలు..!!
- ఖరీఫ్ 2025.. సలామ్ ఎయిర్ రికార్డు వృద్ధి..!!
- సౌదీ అరేబియాలో 3.6 మిలియన్ల ప్రొడక్టులు సీజ్..!!
- టిటిడి పరిపాలనా భవనంలోని పలు శాఖలను పరిశీలించిన టిటిడి ఈవో