అల్ మక్తూమ్ విమానాశ్రయంలో సెకన్లలో ఇమ్మిగ్రేషన్ క్లియర్..!!
- May 10, 2025
దుబాయ్ : అల్ మక్తూమ్ అంతర్జాతీయ (DWC) విమానాశ్రయం గుండా ప్రయాణించే ప్రయాణీకులు స్మార్ట్ కారిడార్ ద్వారా కేవలం సెకన్లలో ఇమ్మిగ్రేషన్‌ను క్లియర్ చేసుకోవచ్చు. దుబాయ్ విమానాశ్రయం (DXB) ఇమ్మిగ్రేషన్ స్మార్ట్ గేట్ల గుండా ఒక వ్యక్తి వెళ్ళే సమయంలో, 10 మంది ప్రయాణికులు కారిడార్ గుండా వెళ్ళవచ్చని ఎమిరేట్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఫారిన్ అఫైర్స్ (GDRFA) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి తెలిపారు. దుబాయ్‌లో జరిగిన ది ఎయిర్‌పోర్ట్ షోలో ఆయన తెలిపారు. గతంలో పాస్‌పోర్ట్ తనిఖీలు, స్టాంపింగ్ విధానాలు ఉన్నాయని, ఇప్పుడు, అన్ని పాస్‌పోర్ట్‌లు కృత్రిమ మేధస్సు (AI) ఉపయోగించి ఆటోమెటిక్ గా ప్రోగ్రామ్ చేయబడి ధృవీకరించబడతాయని పేర్కొన్నారు. DXB ఇప్పటికీ పిల్లల కోసం ప్రత్యేక కౌంటర్లు, తల్లులు, వృద్ధ ప్రయాణీకులకు ప్రాధాన్యతనిచ్చే సేవలతో వ్యక్తిగత అవసరరాలు ఉన్నవారికి తగిన ప్రాధాన్యత ఇస్తామని, వారికి ప్రత్యేక కౌంటర్లు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. అదే సమయంలో ప్యాసింజర్లు లగేజీ నిర్వహణ కూడా ఆటోమేటెడ్ అవుతుందని అధికారులు వెల్లడించారు.
దుబాయ్ ఏవియేషన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ (DAEP)లోని ఫ్యూచర్ ఆఫ్ థింగ్స్ సీనియర్ డైరెక్టర్ అబ్దుల్లా అల్ షంసి ఒక ప్రెజెంటేషన్‌లో ప్రయాణీకులు తమ కార్లలో విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత, ఆటోగా రోబోలు బాధ్యత వహిస్తాయని వివరించారు. వాహనం నుండి లగేజీని నేరుగా చెక్-ఇన్ కౌంటర్‌కు బదిలీ చేయవచ్చని పేర్కొంది.
ప్రయాణికులు యాప్ ద్వారా తమ విమానాలను బుక్ చేసుకోవచ్చని, విమానాశ్రయం డ్యూటీ ఫ్రీ నుండి షాపింగ్ చేయవచ్చు అని తెలిపారు. తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసిన వెంటనే విమానాశ్రయ మెటావర్స్ అనుభవాన్ని ఆస్వాదించవచ్చని పేర్కొన్నారు. టిక్కెట్లు బుక్ చేసుకున్న తర్వాత ప్రయాణికుల బ్యాగులకు ఇ-ట్యాగ్ జారీ అవుతుందని , ఈ సర్వీసును అందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. "ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్" విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో వాహనాలను ట్రాక్ చేస్తుందని, విమానయాన సంస్థలు వచ్చే ప్రయాణీకుల కోసం సిద్ధం కావడానికి వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







