సెనెగల్ స్కూల్ కోసం దుబాయ్ కేర్స్ విజ్ఞప్తి
- July 09, 2016
దుబాయ్ కేర్స్, వాలంటీర్ల కోసం పిలుపునిచ్చింది. వారం పాటు జరిగే స్కూల్ బిల్డింగ్ మిషన్ కోసం వాలంటీర్లు కావాల్సిందిగా దుబాయ్ కేర్స్ పేర్కొంది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 6 వరకు సెనెగల్‌లోని ఫాటిక్ డిస్ట్రిక్ట్‌లో ఈ కార్యక్రమాన్ని చేపడతారు. వాలెంటీర్లు ఆఫ్రికాకి వెళ్ళి అక్కడ స్థానికంగా ఉన్నవారికి కొత్త స్కూల్ నిర్మాణంలో సహకరించాల్సి ఉంటుంది. ఈ స్కూల్ సుమారు 150 మంది చిన్నారులకు ఉపయోగరంగా ఉండనుంది. 17 జులై లోపల ఔత్సాహికులు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దుబాయ్ కేర్స్ 50 మందిని 'ఫస్ట్ కమ్ ఫస్ట్' అనే పద్ధతిలో ఎంపిక చేస్తుంది. వీరి నుంచి 15 మందిని ఇంటర్వ్యూల ద్వారా ఫైనలైజ్ చేస్తుంది. జులై 23 నుంచి 31 వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. మరో 15 మంది వలంటీర్స్ని వెయిటింగ్ లిస్ట్‌లో ఉంచుతారు. ఆసక్తి కలవారు ఈ కింద లింక్ ద్వారా పేరు నమోదు చేసుకోగలరు.
https://docs.google.com/forms/d/159zvehDgqYsxT5cXagMHb763Q7kYdAkT-kpXiCgMMb8/viewform?c=0&w=1
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







