ట్రాఫిక్ పరిష్కారాలపై మంత్రిత్వ శాఖ నివేదిక.. మంత్రుల మండలి ఆమోదం..!!

- May 14, 2025 , by Maagulf
ట్రాఫిక్ పరిష్కారాలపై మంత్రిత్వ శాఖ నివేదిక.. మంత్రుల మండలి ఆమోదం..!!

కువైట్: ట్రాఫిక్ రద్దీని తగ్గించే దిశగా అంతర్గత మంత్రిత్వ శాఖ రూపొందించిన నివేదికకు మంత్రుల మండలి ఆమోదించింది.దీని ప్రకారం.. స్వల్ప, మధ్యస్థ,  దీర్ఘకాలిక అనే 6 కీలక ట్రాఫిక్ పరిష్కారాలను వివరించారు. వీటిని అమలు చేయడానికి 9 ప్రభుత్వ సంస్థలను నియమించింది.

తాత్కాలిక చర్యలలో (1–2 సంవత్సరాలలోపు) రద్దీ సమయాల్లో ట్రాఫిక్‌ను తగ్గించడానికి షేర్డ్ స్కూల్ బస్సులను పెంచడం, సౌకర్యవంతమైన పని గంటలు, సాయంత్రం షిఫ్ట్‌లు, పాఠశాల సమయాల రీషెడ్యూల్ వంటివి ఉన్నాయి. మధ్యస్థ-కాలిక ప్రణాళికలు (3–5 సంవత్సరాలు) ట్రాఫిక్ రద్దీ కమిటీని తిరిగి యాక్టివేట్ చేయడం, సామూహిక రవాణాను నియంత్రించడంలో రోడ్లు మరియు భూ రవాణా కోసం పబ్లిక్ అథారిటీ పాత్రను పెంచడం ఉంటాయి. దీర్ఘకాలిక వ్యూహాలు (5+ సంవత్సరాలు) రోడ్డు నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం, కువైట్ మునిసిపాలిటీ నాల్గవ నిర్మాణ ప్రణాళికను స్వీకరించడం, ఆరవ మరియు ఏడవ రింగ్ రోడ్ల వంటి ప్రధాన రహదారులకు అప్‌గ్రేడ్‌లను అధ్యయనం చేయడంపై దృష్టి పెట్టనున్నారు.

ఆర్థిక, ప్రజా పనులు, విద్య, రవాణా, ఇతర మంత్రిత్వ శాఖలతో సహా వివిధ సంస్థల మధ్య సమన్వయంతో రూపొందించే కార్యాచరణను అంతర్గత మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది. ప్రతి ఏజెన్సీ నెలవారీ పురోగతి నివేదికలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.కువైట్‌లో కొనసాగుతున్న ట్రాఫిక్ సమస్యలకు సమగ్రమైన, ఆచరణాత్మకమైన, స్థిరమైన పరిష్కారం కోసం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అంతర్గత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com