టిటిడి ఛైర్మన్ స్విమ్స్ ఆసుపత్రి తనిఖీ
- May 14, 2025
తిరుపతి: తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిని టిటిడి ఛైర్మన్ బి.ఆర్. నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గుండె శస్త్రచికిత్స విభాగంలో రోగులతో మాట్లాడి, వారి సమస్యలు, ఆసుపత్రి సౌకర్యాల గురించి ఆరా తీశారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా నమోదైన రోగులతో సంభాషించి, వైద్య సదుపాయాలను పరిశీలించారు. టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న ఆసుపత్రి సేవలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన వీడియో-కాలింగ్ ప్లాట్‌ఫామ్ ‘స్కైప్’ సేవలు ఈ నెల 5 నుంచి నిలిచిపోనున్నాయి. స్కైప్‌కు వీడ్కోలు (ఫేర్‌వెల్) పలుకుతున్నామని, మే 5 తర్వాత యూజర్లకు ఈ అప్లికేషన్ అందుబాటులో ఉండదని మైక్రోసాఫ్ట్ తాజాగా వెల్లడించింది. దీనిని వాడుతున్న యూజర్లు ‘టీమ్స్’కు మారాల్సి ఉంటుందని తెలిపింది. స్కైప్ తన వీడియో కాన్ఫరెన్సింగ్ సేవల్ని 2003లో తొలుత ప్రారంభించింది. అప్పట్నుంచీ దాదాపు 2 దశాబ్దాలుగా పాపులర్ ఫ్లాట్‌ఫామ్‌గా నిలిచింది. దీనిని 2011లో మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. 2017లో మైక్రోసాఫ్ట్ టీమ్స్‌ను లాంచ్ చేసినప్పటి నుంచి స్కైప్ అంతర్గతంగా పోటీ ఎదుర్కొంటున్నది. ఆధునిక సమాచారం, సహకార వ్యవస్థకు ప్రైమరీ హబ్‌గా ‘మైక్రోసాఫ్ట్ టీమ్స్’ను నిలుపబోతున్నట్టు సంస్థ ప్రకటించింది. తమ యూజర్ల కమ్యునికేషన్ టూల్స్ అన్నింటినీ ఒక గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు ‘స్కైప్’కు వీడ్కోలు పలుకుతున్నట్టు తెలిపింది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల అనంతరం కతార్‌లో ఇండియన్ ఎంబసీ హెచ్చరిక
- ఎయిర్ ఇండియా మిడిల్ ఈస్ట్ విమానాలను నిలిపివేత
- నివాసితులను అప్రమత్తంగా ఉండాలని కోరిన దుబాయ్ సెక్యూరిటీ సర్వీస్
- కతార్ పై మిసైల్ దాడిని తీవ్రంగా ఖండించిన GCC ప్రధాన కార్యదర్శి
- బహ్రెయిన్ వైమానిక పరిధిని తాత్కాలికంగా నిలిపివేత
- కువైట్ తాత్కాలికంగా వైమానిక పరిధి మూసివేత
- శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం
- ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు: ఎండీ వీసీ సజ్జనర్
- భారత్‌కి క్రూడాయిల్ విషయంలో ఇబ్బంది లేదు: హర్దీప్ సింగ్
- చెన్నై పోలీసుల అదుపులో హీరో శ్రీరామ్..