ఈ చిట్కా పాటిస్తే మోకాళ్ల నొప్పులు మటు మాయం
- May 14, 2025
మట్టే కదా అని తీసి పారేస్తాం. కానీ..ఆ మట్టితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలుంటాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీకు తెలిసే ఉంటుంది. ఒకప్పుడు ప్రకతి వైద్యం చాలా ఫేమస్. అలోపతి లేని రోజుల్లో పూర్తిగా సహజ సిద్ధమైన వైద్యంతోనే ఏ రోగాన్నైనా తగ్గించుకునే వాళ్లు. ఈ ప్రకృతి వైద్యంలో మట్టికి చాలా ప్రాధాన్యత ఉండేది. కొన్ని రకాల జబ్బులకు బంక మట్టితో వైద్యం చేసే వాళ్లు. ఒళ్లంతా మట్టి పట్టించి చికిత్స చేసే వాళ్లు. ప్రస్తుతం అదంతా మారిపోయింది.
అయితే..ఇప్పటికీ ఈ చిట్కాలు పాటించే వాళ్లున్నారు. కొంతమంది ఆయుర్వేద వైద్య నిపుణులు ఆ కాలపు చికిత్సలను మరోసారి పరిచయం చేస్తున్నారు. అలాంటి వాటిలో ఓ చిట్కా తెగ వైరల్ అవుతోంది. చాలా మంది వయసు మళ్లే కొద్దీ కీళ్ల నొప్పులతో విపరీతంగా బాధ పడుతుంటారు. అలాంటి వాళ్లకు ఎలాంటి సర్జరీలు, మెడికేషన్ అక్కర్లేని ఓ చిట్కా మీకు చెబుతున్నాం. ఎలాంటి ఖర్చు లేకుండా చాలా సింపుల్ గా పుట్టమన్నుతో కీళ్ల నొప్పులు తగ్గించుకునే మార్గాన్ని వివరించారు. అదెలాగో ఓ సారి చూద్దాం.
ఓ వయసు వచ్చిన తరవాత ఎముకల్లో బలం తగ్గిపోతూ ఉంటుంది. నడవాలన్నా, కూర్చోవాలన్నా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఒకప్పుడు 50 ఏళ్లకు వచ్చే మోకాళ్ల నొప్పుల సమస్య ఇప్పుడు మరీ 40 ఏళ్లకే వచ్చేస్తోంది. జీవన శైలిలో మార్పులు రావడం, అసలు రెస్ట్ అనేది లేకుండా పని చేయడం వల్ల చాలా తొందరగా ఎముకలు అరిగిపోతున్నాయి. ఇక పెద్ద వాళ్ల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
50 ఏళ్లు దాటాయంటే ఎవరి పని వాళ్లు చేసుకోవడమే చాలా కష్టంగా మారుతోంది. జాయింట్ పెయిన్స్ భరించలేక చాలా మంది సర్జరీలు చేయించుకుంటున్నారు. ఇది కొంత వరకూ ఉపశమనం ఇస్తున్నా అది కృత్రిమంగానే ఉంటోంది. అయితే చాలా సహజంగా ఈ నొప్పులను తగ్గించుకునే మార్గం ఉందని చెబుతున్నారు ప్రదీప్ వానపల్లి. కేవలం పుట్టమన్ను తెచ్చుకుంటే చాలు..నొప్పులన్నీ మాయమైపోతాయని అంటున్నారు.
పుట్టమన్ను దొరకడం మరీ కష్టమేమీ కాదు. కాస్తంత ప్రయత్నిస్తే దొరుకుతుంది. ఈ పుట్టమన్నుని తీసుకొచ్చి ముందుగా మిక్సీ పట్టాలి. లేదా రోట్లో వేసి దంచినా పరవాలేదు. అది మెత్తగా మారేంత వరకూ గ్రైండ్ చేయాలి. ఈ పౌడర్ ని ఓ సీసాలో స్టోర్ చేసుకోవాలి. రోజూ కనీసం రెండు సార్లు ఈ మన్నుని వాడుకోవచ్చు.
ఎలాగంటే.. ముందుగా ఓ పల్చని కాటన్ క్లాత్ తీసుకోవాలి. దానిపైన ఈ పొడి వేయాలి. అందులో కాస్త నీళ్లు పోయాలి. పేస్ట్ లా తయారయ్యేంత మేర నీళ్లు పోయాల్సి ఉంటుంది. ఇప్పుడా ఆ క్లాత్ ని కాసేపు అలాగే ఉంచాలి. ఆ పుట్టమన్ను పేస్ట్ క్లాత్ కి బాగా పట్టేంత వరకూ చూడాలి.
పుట్టమన్ను పేస్ట్ ని రాసిన ఆ క్లాత్ ని మీకు నొప్పిగా అనిపించిన చోట కట్టులా కట్టాలి. సరిగ్గా నొప్పి ఎక్కడుందో అక్కడే ఈ మట్టి ఉండేలా చూడాలి. ఉదాహరణకు మీకు మోకాళ్ల నొప్పులు విపరీతంగా ఉంటే సరిగ్గా ఎక్కడైతే నొప్పి ఎక్కువగా ఉందో చూసి అక్కడ ఈ మట్టి ఉండేలా కట్టు కట్టాలి. అయితే..దాన్ని అలా వదిలేయకుండా మధ్య మధ్యలో కాసిన్ని నీళ్లు పోస్తూ ఉండాలి. ఎప్పుడూ దానికి తడి తగిలేలా చూడాలి. రోజుకి కనీసం రెండు సార్లు ఈ చిట్కాని పాటించాలి. ఉదయం సాయంత్రం ఇలా కట్టు కడితే ఫలితాలు బాగుంటాయి.
పుట్ట మన్నుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. ముఖ్యంగా ఇందులోని యాంటీ ఇన్ ఫ్లమేషన్ గుణాలు కండరాల నొప్పిని పూర్తిగా తగ్గిస్తాయి. రక్త ప్రసరణ బాగా జరిగేలా చూస్తాయి. జాయింట్ పెయిన్స్ ని చాలా త్వరగా పోగొడతాయి. కేవలం నొప్పులకే కాదు. జుట్టు, చర్మ ఆరోగ్యానికీ పుట్ట మన్నుని వాడతారు. శరీరంలో చలువ పెంచడంలోనూ పుట్ట మన్ను బాగా పని చేస్తుంది. ఆర్థ్రైటిస్ లాంటి సమస్యల్నీ తగ్గించే గుణం ఇందులో ఉంటుంది. ఒంటి నొప్పులు తగ్గించే బామ్స్ లో పుట్టమన్నుని ఎక్కువగా వాడతారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల అనంతరం కతార్‌లో ఇండియన్ ఎంబసీ హెచ్చరిక
- ఎయిర్ ఇండియా మిడిల్ ఈస్ట్ విమానాలను నిలిపివేత
- నివాసితులను అప్రమత్తంగా ఉండాలని కోరిన దుబాయ్ సెక్యూరిటీ సర్వీస్
- కతార్ పై మిసైల్ దాడిని తీవ్రంగా ఖండించిన GCC ప్రధాన కార్యదర్శి
- బహ్రెయిన్ వైమానిక పరిధిని తాత్కాలికంగా నిలిపివేత
- కువైట్ తాత్కాలికంగా వైమానిక పరిధి మూసివేత
- శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం
- ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు: ఎండీ వీసీ సజ్జనర్
- భారత్‌కి క్రూడాయిల్ విషయంలో ఇబ్బంది లేదు: హర్దీప్ సింగ్
- చెన్నై పోలీసుల అదుపులో హీరో శ్రీరామ్..