యూఏఈలో ట్రంప్.. AI, క్రిప్టో రంగాలకు బూస్ట్..!!

- May 16, 2025 , by Maagulf
యూఏఈలో ట్రంప్.. AI, క్రిప్టో రంగాలకు బూస్ట్..!!

యూఏఈ: యూఏఈ, ఇతర గల్ఫ్ దేశాలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనతో చమురు ఉత్పత్తి,  ఇంధన ధరలకు స్థిరత్వం వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దాంతోపాటు కృత్రిమ మేధస్సు, క్రిప్టోకరెన్సీలు, బ్లాక్‌చెయిన్, సాంకేతిక పరిజ్ఞానాల పరంగా స్థానిక కంపెనీల వృద్ధి అవకాశాలను పెంచుతుందని అంటున్నారు. యుఎస్ అధ్యక్షుడు తన మధ్యప్రాచ్య పర్యటనలో భాగంగా గురువారం ఎమిరేట్స్ చేరుకున్నారు.  

"AI అభివృద్ధి నుండి యూఏఈ చాలా ప్రయోజనం పొందుతుందని, కొత్త ముఖ్యమైన చిప్‌లను పొందగలదని నేను నమ్ముతున్నాను. ఈ సందర్శన చాలా కీలకమైనది. యూఏఈ ఆర్థిక వ్యవస్థకు మరింత దృఢత్వాన్ని ఇస్తుంది. యూఏఈ, GCC ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చాలా ముఖ్యమైన ప్రాంతం." అని Exness సీనియర్ మార్కెట్ వ్యూహకర్త వేల్ మకరెం అన్నారు.

యూఏఈలో క్రిప్టోకరెన్సీల కోసం ట్రంప్ పర్యటన ఎమిరేట్స్‌కు ప్రయోజనం చేకూరుస్తుందని xs.comలో మెనా మార్కెట్ పరిశోధన అధిపతి అహ్మద్ నెగ్మ్ అన్నారు.   

సాక్సో బ్యాంక్‌లోని మెనా ట్రేడింగ్ హెడ్ హంజా డ్వీక్ మాట్లాడుతూ.. ట్రంప్ పర్యటన "అంతర్జాతీయ దౌత్యం, ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే వ్యక్తిగా యూఏఈ పెరుగుతున్న ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది" అని అన్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com