కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!

- January 20, 2026 , by Maagulf
కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!

మస్కట్: కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం విధించింది. ఈమేరకు వ్యవసాయ, మత్స్య మరియు జలవనరుల మంత్రిత్వ శాఖ (MAFWR) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం కేరళ నుండి వచ్చే లైవ్ బర్డ్స్, వాటి ఉత్పత్తులకు వర్తిస్తుంది. ప్రస్తుతం నెలకొన్న భయాందోళనలు తొలగిపోయే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది.

అయితే, గతంలో OIEగా పిలువబడిన ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ (WOAH) జారీ చేసిన యానిమల్ ఆరోగ్య కోడ్ ప్రకారం శుద్ధి చేయబడిన లేదా థర్మల్ ప్రాసెస్ కు గురిచేసిన పౌల్ట్రీ ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తించదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com