షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!

- January 20, 2026 , by Maagulf
షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!

యూఏఈ: షార్జాలోని కొన్ని పెట్రోల్ స్టేషన్లలో ఉండే సీసీ కెమెరా వ్యవస్థలను త్వరలో ఎమిరేట్ పోలీసు సిస్టమ్ తో లింక్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో పోలీసులు వేగంగా స్పందించడానికి వీలవుతుందని, తద్వారా నేరాలను సకాలంలో అడ్డుకోవడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ఈ కొత్త ప్రాజెక్ట్ కింద నగరం అంతటా ఉన్న అడ్నాక్ స్టేషన్లలోని కెమెరా వ్యవస్థలను షార్జా పోలీసుల ఆపరేషన్స్ రూమ్‌కు లింక్ చేస్తారు. ఈ మేరకు అడ్నాక్ డిస్ట్రిబ్యూషన్‌లో ఆపరేషన్స్ అస్యూరెన్స్ డైరెక్టర్ షేఖా అల్ ఖౌరీ మరియు షార్జా పోలీసు అధికారుల మధ్య జరిగిన సమావేశం తర్వాత ఈ తాజా ప్రాజెక్ట్ గురించిన ప్రకటన చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com