ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!

- January 20, 2026 , by Maagulf
ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!

కువైట్: ఇండియా నుండి కొత్త చేపల దిగుమతి మార్గాలను తెరవాలని యోచిస్తున్నట్లు కువైట్ మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు అబ్దుల్లా అల్-సర్హీద్ ప్రకటించారు. స్థానిక మార్కెట్‌లో చేపల సరఫరాను కొనసాగించడానికి మరియు ధరలను తగ్గించడానికి, వినియోగదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి సహాయపడతాయని ఆయన వివరించారు.

ఇలా భారత్ నుంచి దిగుమతి చేసుకున్న చేపలను మత్స్యకారుల సంఘం విక్రయ కేంద్రాల ద్వారా నేరుగా విక్రయించడానికి అనుమతి కోరుతూ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి ఖలీఫా అల్-అజిల్‌కు విజ్ఞప్తి చేసినట్టు  అల్-సర్హీద్ తెలిపారు.

సంఘానికి సుమారు 50 చేపల దుకాణాలు ఉన్నాయని, వాటిలో దిగుమతి చేసుకున్న చేపలను సరసమైన ధరలకు విక్రయించడానికి ఉపయోగించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ చర్య కొన్ని చేపల మార్కెట్లలో గుత్తాధిపత్య పద్ధతులను తొలగించడానికి మరియు పోటీని పెంచడానికి కూడా సహాయపడుతుందని అన్నారు. ముఖ్యంగా స్థానికంగా చేపల వేటపై ఆంక్షలు ఉండే సమయాల్లో నాణ్యమైన చేపల సరఫరాకు ఇండియా నుంచి చేపల దిగుమతి అవసరమని అల్-సర్హీద్ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com