ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- January 20, 2026
మనామా: హిద్ద్ లోని షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రద్దీ సమయాల్లో ట్రక్కులపై ఉన్న నిషేధాన్ని పొడిగించాలనే డిమాండ్లపై జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ముహారక్ మున్సిపల్ కౌన్సిల్‌కు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ అధికారికంగా సమాధానం ఇచ్చింది. బ్రిడ్జిపై ట్రక్రుల కదలికను పరిమితం చేయడానికి ప్రస్తుత నిషేధ సమయాలు సరిపోతాయని, ఈ దశలో ఎటువంటి మార్పులు అవసరం లేదని తెలిపింది.
ట్రాఫిక్ కౌన్సిల్ నిర్ణయం ప్రకారం ఉదయం 6:30 నుండి ఉదయం 8:00 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2:00 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు ట్రక్కులను నిషేధించామని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ డిప్యూటీ డైరెక్టర్ బ్రిగేడియర్ మొహమ్మద్ అల్ దరగ్ వివరించారు. రవాణా అవసరాలు, అభివృద్ధి ప్రాజెక్టులు మరియు వాణిజ్య, నిర్మాణం మరియు పారిశ్రామిక వృద్ధిని పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే నిషేధ సమయాలను నిర్ణయించినట్లు బ్రిగేడియర్ అల్ డరాగ్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







