ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- January 20, 2026
హైదరాబాద్: ప్రజలకు మరింత చేరువయ్యే దిశగా తెలంగాణ పోలీసు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సైబర్ నేరాల బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే, ఇంటి నుంచే ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ‘సీ-మిత్ర’ పేరుతో ప్రత్యేక వర్చువల్ హెల్ప్ డెస్క్‌ను ప్రారంభించారు.
సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది బాధితులు ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్నారని అధికారులు గుర్తించారు. ఈ సమస్యను అధిగమించేందుకు సీ-మిత్ర ద్వారా బాధితులను స్వయంగా సంప్రదించి, ఏఐ సాయంతో ఫిర్యాదు డ్రాఫ్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 10 రోజుల్లో వెయ్యి మందికి ఫోన్ చేసి, 200 మందికి ఫిర్యాదులు తయారు చేయగా, నిమిషాల్లోనే ఎఫ్ఐఆర్ కాపీలు బాధితుల ఫోన్లకు పంపినట్లు తెలిపారు.
సైబర్ మోసానికి గురైన వారు ముందుగా 1930 హెల్ప్‌లైన్ లేదా జాతీయ సైబర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి. ఆ తర్వాత స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, సీ-మిత్ర హెల్ప్ డెస్క్ ద్వారా ఇంటి నుంచే ఎఫ్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అందుబాటులో ఉన్న ఈ సేవలను త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలంగాణ పోలీస్ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు







