పిల్లలమర్రిని సందర్శించిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు

- May 16, 2025 , by Maagulf
పిల్లలమర్రిని సందర్శించిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు

--పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు

హైదరాబాద్: 7 శతాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న పిల్లలమర్రిలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందడి చేశారు.  హైదరాబాదులో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన  ఓ  బృందం శుక్రవారం పిల్లలమర్రిని సందర్శించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు మహబూబ్ నగర్  కు చేరుకున్నారు. తెలంగాణ పండుగల విశిష్టత సంస్కృతిని ప్రతిబింబించేలా సాంప్రదాయ నృత్యాల మధ్య సుందరీమణుల బృందానికి స్వాగతం పలికారు. 

మొదట శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మ్యూజియాన్ని సందర్శించారు. కాసేపు  ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. గిరిజన యువతుల బంజారా నృత్యం చేయగా, మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు వారితో జత కలిశారు. 

తర్వాత పిల్లలమర్రి మహావృక్షాన్ని వీక్షించారు. చెట్టు యొక్క చరిత్ర, మహావృక్షం పునరుజ్జీవనం గురించి అటవీ శాఖ అధికారి వారికి వివరించారు. నారాయణపేట, గద్వాల చేనేత వస్త్రాలు, హస్తకళలు, కళాకృతులు  స్టాల్స్ ను  సందర్శించారు. అనంతరం  మర్రి చెట్టు వద్ద గ్రూప్ ఫోటో దిగారు. 

ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, బండ్లకృష్ణ మోహన్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మధుసూదన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, పర్ణిక రెడ్డి,  వీర్లపల్లి శంకర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com