ఏప్రిల్‌లో 2.3% వద్ద స్థిరంగా ద్రవ్యోల్బణం..!!

- May 17, 2025 , by Maagulf
ఏప్రిల్‌లో 2.3% వద్ద స్థిరంగా ద్రవ్యోల్బణం..!!

రియాద్:  సౌదీ అరేబియాలో వార్షిక ద్రవ్యోల్బణం రేటు ఏప్రిల్ 2025లో 2.3 శాతంగా ఉంది. జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) ప్రచురించిన నెలవారీ గణాంకాల బులెటిన్ ప్రకారం.. వినియోగదారుల ధరల సూచిక లేదా ద్రవ్యోల్బణం ప్రధానంగా అపార్ట్‌మెంట్ అద్దెలలో 11.9 శాతం పెరుగుదల కారణంగా ప్రభావితమైంది.

గృహ, నీరు, విద్యుత్, గ్యాస్, ఇంధన ధరలు 6.8 శాతం పెరిగాయని, నివాస అద్దెలలో 8.1 శాతం పెరుగుదల, అపార్ట్‌మెంట్ అద్దెలలో 11.9 శాతం పెరుగుదల ద్వారా ప్రభావితమైందని నివేదిక తెలిపింది. ఈ కేటగిరీలో పెరుగుదల ఏప్రిల్‌లో వార్షిక ద్రవ్యోల్బణం కొనసాగిన వేగంపై ప్రభావాన్ని చూపిందని, దీని వాటా 25.5 శాతంగా ఉందని వెల్లడించింది.

కూరగాయల ధరలు 9.4 శాతం పెరగడం వల్ల ఆహారం , పానీయాల ధరలు 2.2 శాతం పెరిగాయి. విద్యా వర్గం 1.3 శాతం పెరుగుదలను నమోదు చేసింది.  ఇది పోస్ట్-సెకండరీ నాన్-టెర్షియరీ ఎడ్యుకేషన్ ఫీజులలో 5.6 శాతం పెరుగుదల కారణంగా ప్రభావితమైంది.

GASTAT నివేదిక ప్రకారం.. ఇతర వ్యక్తిగత వస్తువులు, సేవల కేటగిరీ ధరలు 3.5 శాతం పెరిగాయి.  ఇది నగలు, గడియారాలు, విలువైన పురాతన వస్తువుల ధరలలో 21.9 శాతం పెరుగుదల నమోదైంది.  క్యాటరింగ్ సేవలలో 2 శాతం పెరుగుదల కారణంగా రెస్టారెంట్, హోటల్ ధరలు కూడా 2 శాతం పెరిగాయి.

మరోవైపు, గృహోపకరణాలు, పరికరాల కేటగిరీ ధరలు 1.8 శాతం తగ్గాయి.  ఇది ఫర్నిచర్, కార్పెట్‌లు,  ఫ్లోర్ కవరింగ్‌ల ధరలలో 3.5 శాతం తగ్గుదల కారణంగా ప్రభావితమైంది. దుస్తులు, పాదరక్షల వర్గం ధరలు 1.2 శాతం తగ్గాయి.  రెడీమేడ్ దుస్తుల ధరలు 2.1 శాతం తగ్గాయి. రవాణా వర్గం ధరలు కూడా ఒక శాతం తగ్గాయి, వాహనాల కొనుగోలు ధర 1.8 శాతం తగ్గింది.

వినియోగదారుల ధరల సూచిక వినోదం, సంస్కృతి వర్గం ధరలలో 0.4 శాతం తగ్గుదల నమోదు చేయగా.. రవాణా, కమ్యూనికేషన్లు, ఆరోగ్య వర్గాలు 0.1 శాతం తగ్గుదల నమోదు చేశాయి. పొగాకు ఉత్పత్తుల ధరలు ఏప్రిల్ 2025లో పెద్దగా మారలేదని నివేదికలో వెల్లడించారు.

  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com