అల్-మిర్కాబ్ పునరాభివృద్ధి పై కుదిరిన ఒప్పందం..!!

- May 17, 2025 , by Maagulf
అల్-మిర్కాబ్ పునరాభివృద్ధి పై కుదిరిన ఒప్పందం..!!

కువైట్: అల్-మిర్కాబ్ ప్రాంతంలో కేంద్రంగా ఉన్న స్థలాన్ని నివాసేతర పట్టణాన్ని పెట్టుబడికి కేంద్రంగా మార్చడం లక్ష్యంగా పబ్లిక్ అథారిటీ ఫర్ హౌసింగ్ వెల్ఫేర్ ఒక ఒప్పందంపై సంతకం చేసింది. 428,990 చదరపు మీటర్లకు పైగా విస్తరించి ఉన్న అల్-మిర్కాబ్ ప్రాజెక్ట్ కువైట్ నగరం దీర్ఘకాలిక పట్టణ, ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలకు మద్దతుగా రూపొందించారు.ఈ చొరవలో సమగ్ర మాస్టర్ ప్లాన్, భూ వినియోగ బడ్జెట్, పెట్టుబడి ఆఫర్లకు మార్గనిర్దేశం చేయడానికి సాంకేతిక అధ్యయనాలు ఉన్నాయి.

భవిష్యత్ జనాభా, ఆర్థిక వృద్ధికి అనుగుణంగా ఆధునిక మౌలిక సదుపాయాలు, మెరుగైన రవాణా నెట్‌వర్క్‌లు, స్థిరమైన డిజైన్‌ను సమగ్రపరచడంపై ఈ ప్రణాళిక దృష్టి పెడుతుంది. అధికారుల కథనం ప్రకారం.. ఈ ప్రాంతం కువైట్ విస్తృత అభివృద్ధి వ్యూహాలకు అనుగుణంగా ఉండే లాజిస్టికల్,  సేవా మౌలిక సదుపాయాలతో కనెక్ట్ చేయనున్నారు. 36 నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్న ఈ ప్రాజెక్ట్, అల్-మిర్కాబ్‌ను రాజధానిలో ఒక మైలురాయి అభివృద్ధిగా ఉంచడం లక్ష్యంగా పెట్టుకుందని, ఇంటిగ్రేటెడ్ సేవలు, ఆధునిక ప్రణాళికలతో అధిక-విలువైన పెట్టుబడి అవకాశాలను అందిస్తుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com