ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య ప్రాపర్టీ వివాదం.. వేలం వేయాలని కోర్టు ఆదేశాలు..!!
- May 17, 2025
మనామా: ముగ్గురు స్నేహితుల మధ్య దశాబ్ద కాలంగా కొనసాగుతున్న జాయింట్ వెంచర్ వివాదం ఎట్టకేలకు ముగింపుకొచ్చింది. ప్రాపర్టీ షేర్ హోల్డర్ల వాటా మొత్తాలను చెల్లించని కారణంగా BD280,000 విలువైన ఆస్తిని వేలంలో విక్రయించనున్నారు. మూడవ పార్టనర్ తమ వాటాలను చెల్లించడానికి నిరాకరించడంతో ఇద్దరు భాగస్వాములు కోర్టును ఆశ్రయించారు. ముగ్గురూ తమ పొదుపు మొత్తాన్ని ఇంటి నిర్మాణం కోసం కేటాయించినట్లు, తరువాత దానిని విక్రయించి డబ్బును పంచుకోవాలని ఆశించినట్లు కోర్టుకు తెలిపారు. వారిలో ఒకరు చివరిలో అడ్డం తిరగడంతో ఏడు సంవత్సరాలుగా వివాదం నడుస్తుందని, తమ ప్రయత్నాలు ఫలించలేదని, ఆస్తి ముగ్గురి పేర్లలోనూ నమోదు అయి ఉందని దానిని వేలం వేసి సొమ్మను తిరిగి ఇప్పించాలని కోర్టును ఆశ్రయించారు. వారి వాదనలు విన్న కోర్టు ప్రాపర్టీని వేలం వేయాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీగా కల్తీ, నాణ్యత లేని ఆహారం ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో విద్వేష ప్రసంగాలకు కఠిన శిక్షలు..!!
- పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్ శివప్రతాప్
- వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్!
- మక్కాలో ఐదుగురు పాకిస్థానీలు అరెస్ట్..!!
- బర్కా, యాంకుల్కు WHO ‘హెల్తీ సిటీ’ గుర్తింపు..!!
- 2030 విజన్ కోసం ఖతార్ కీలక అడుగు..!!
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదాలు–15 మంది మృతి!
- పాస్‌పోర్ట్ అవసరం లేదు.. లగేజ్ ట్యాగ్ కూడా ఉండదు..!!
- షార్జా ఎక్స్పో సెంటర్లో మమ్ముట్టి ‘రాజకీయమ్’ షో..







