యూఏఈలో డ్రోన్ల కోసం.. తొలిసారి జాతీయ సైబర్ భద్రతా గైడ్ లైన్స్..!!
- May 18, 2025
యూఏఈ: డ్రోన్ల కోసం యూఏఈ సైబర్ భద్రతా మండలి శనివారం తొలి జాతీయ మార్గదర్శకాలను ప్రకటించింది. వ్యవసాయం, పర్యావరణ పర్యవేక్ష, లాజిస్టిక్స్ వంటి వివిధ రంగాలలో డ్రోన్ల వినియోగం పెరుగుతున్నందునా.. గగనతలం, మౌలిక సదుపాయాలు, సైబర్ ముప్పుల నేపథ్యంలో అవసరమైన కార్యాచరణ అత్యవసరంగా మారిందని అధికారులు తెలిపారు.
యూఏఈ ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ మొహమ్మద్ అల్ కువైట్ మాట్లాడుతూ.. ఈ ముఖ్యమైన జాతీయ మార్గదర్శకాలు డిజిటల్ పరంగా మెరుగైన విధానాన్ని ప్రతిబింబిస్తాయని అన్నారు. రీచ్ గ్రూప్ సీఈఓ మాలెక్ మెల్హెమ్ మాట్లాడుతూ.. యూఏఈ డిజిటల్, సైబర్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి గ్రూప్ కట్టుబడి ఉందని అన్నారు.
ఈ చొరవ డ్రోన్ల వినియోగంలో సురక్షితమైన ఆవిష్కరణలకు మద్దతు ఇస్తుందని తెలిపారు. అదే సమయంలో జాతీయ వైమానిక మౌలిక సదుపాయాలపై పెరుగుతున్న సైబర్ ప్రమాదాలను పరిష్కరిస్తుందని రీచ్ గ్రూప్లో గ్రోత్ అండ్ కార్పొరేట్ ట్రాన్స్ఫర్మేషన్ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ఖలీద్ అన్నారు.
తాజా వార్తలు
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!







